ప్రత్యర్ధ రాజకీయ నాయకులను రెచ్చగొట్టటం కూడా ఒక ఆర్ట్. ఇది వైసిపీ నేతలకు బాగా వచ్చు. గతంలో విజయవాడలోని పాత బస్ స్టాండ్ సమీపంలో, ఫ్లై ఓవర్ కూడలి వద్ద, రోడ్డుకి అడ్డంగా, దాదపుగా సగం రోడ్డు ఆక్రమించుకుని, వైఎస్ఆర్ విగ్రహం ఉండేది. అయితే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అధికారుల సూచనలతో, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆక్కడ నుంచి ఆ విగ్రహం తొలగించింది. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి రావటంతోనే, అక్కడే మళ్ళీ వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అయితే, రోడ్డుకి అడ్డంగా, క్రితం సారి పెట్టినట్టు పెడితే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి, దాని పక్కనే పిల్లలు ఆడుకునే అవతార్ పార్క్ లో, అక్కడ ఉన్న బొమ్మలు పీకేసి, అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టటానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్క్ లో బొమ్మలు తీసి మరీ, పెట్టటం పై విమర్శలు వచ్చాయి.
అయినా ప్రభుత్వం తలుచుకుంటే, ఏదైనా జరుగుతుంది కాబట్టి, ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. పనులు చకచకా జరిగిపోయాయి. అక్కడ వైఎస్ఆర్ బొమ్మ పెట్టేసారు. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల అయ్యింది. అక్కడ పార్క్ పేరు కూడా మార్చేసి, వైఎస్ఆర్ పార్క్ అని నామకరణం చేసారు. జీవోలో ఇంకో విషయం ఏమిటంటే, విఎంసి కమీషనర్, అక్కడ వైఎయస్ఆర్ విగ్రహం పెట్టమని ఉత్తరం రాసారు అంట, అందుకే యా ఉత్తరం పరిశీలించి, అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెడుతున్నారు అంట. విఎంసి కమీషనర్ వైఎస్ఆర్ విగ్రహం పెట్టమని ఎందుకు ఉత్తరం రాస్తారో, వారికే తెలియాలి. అయితే, రేపు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, ఈ విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆహ్వాన పత్రికతో పాటు, శిలాఫలకం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దాని మీద, ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్టు ఉంది. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బీజేపీ నేత సుజనా చౌదరి పేర్లను ముద్రించారు. అయితే ఇది ప్రోటోకాల్ ప్రకారం జరిగిందని చెప్తున్నా, కావాలని ప్రత్యర్ధులను రెచ్చగొట్టే విధంగా, ఇలా చేస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ఆహ్వానం పలకకుండా, పెన్షన్లు ఇచ్చే చోటుకు, మీ ఎమ్మెల్యేలు వెళ్తే దాడి చేస్తూ, ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు, మమ్మల్ని పిలిచాం అంటూ, పైశాచిక ఆనందం పొందుతున్నారని, టిడిపి నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నో పనులు పెండింగ్ లో పెట్టు, ఉన్న పళంగా, అక్కడ బొమ్ములు కొట్టేసి, వైఎస్ఆర్ విగ్రహం పెట్టేంత ఖంగారు ఏముంది టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలకు వస్తాం కాని, ఇలాంటి పనికిమాలిన పనులకు మీము ఎందుకు వెళ్తాం అంటున్నారు.