ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై జగన్ ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రెండు రోజులు నుంచి అమరావతి రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగుతునే ఉన్నారు. ఈ రోజు రాజధాని ప్రాంతానికి చెందిన మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు జగన్ ప్రభుత్వానికి నిరసనగా ఆందోళన బాట పట్టారు. అమరావతి రాజధాని పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతులు రోడ్డు పై భైఠాయించారు. అమరావతిని ఇక్కడే రాజధానిగా కొనసాగించాలని, మంత్రి బొత్స, రైతులు కౌలు డబ్బులు కోసమే ఆందోళన చేస్తున్నారు అంటూ చసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అమరావతిలోని గ్రామాలు కానీ, కొండవీటి వాగు ఎప్పుడూ మునగలేదని, రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చెయ్యొద్దని రైతులు మండిపడ్డారు.
ఈ రోజు రాజధాని అమరావతి మార్పు అంశం పై రైతుల ఆందోళన సెగ ఒక్కసారిగా జగన్ మోహన్ రెడ్డికి తగిలింది. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సెక్రటేరియట్ కు వెళ్తూ ఉండగా, మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు జగన్ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసారు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రైతుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాడ్లు చేసారు. అమరావతి ఇక్కడే కొనసాగించాలని, నినదించారు. అయితే ఈ పరిణామంతో, పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఎక్కడ వారు జగన్ కాన్వాయ్ ని ఆపుతారో అని ఫుల్ పోలీస్ ఫోర్సు పెట్టారు. వారిని జగన్ కాన్వాయ్ ని అడ్డుకోకుండా, పోలీసులు నియంత్రించారు. అయినప్పటికీ, జగన్ కారుని చూడగానే, జగన్ కు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు సెహ్సారు.
పోలీసులు ఈ పరిణామంతో ఒక్కసారిగా వారిని అడ్డుకుని, పక్కకు తరలించారు. అయితే మొదటి సారి, తాను ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, ప్రజా వ్యతిరేకత డైరెక్ట్ గా చూడటంతో, ఈ సంఘటన పై జగన్ ఒక్కసారిగా నివ్వెరపోయారు. అక్కడ ఆందోళన చేస్తున్న రైతులకు అభివాదం చేస్తూ, జగన్ వెళ్ళిపోయారు. మరో పక్క, ఈ రోజు బీజేపీ నేతలు అమరావతి ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బీజేపీ ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారయణ, అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే అది బయట పెట్టి, వారికి శిక్ష పడేలా చెయ్యచ్చు కాని, ఇలా రాజకీయం కోసం, ఒక ప్రాంతాన్ని, ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టటం కరెక్ట్ కాదని వారు అభిప్రాయ పడ్డారు.