జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఈ రోజు కేంద్ర హోం మంత్రి అధ్యకతన జరిగే సమావేశంలో హాజరయ్యేందుకు జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. జగన్ తో, పాటుగా అధికారుల బృందం కూడా ఢిల్లీ వెళ్ళింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యకతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ రోజు జరిగింది. ఇందులో, మన రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలతో పాటు, ఏవోబీలో నక్సల్స్ ఉనికి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాల పై చర్చించారు. ఈ సందర్భంగా మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో, రాష్ట్రానికి కావాల్సిన సహాయం గురించి జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర హోం మంత్రికి ఒక నివేదిక ఇచ్చారు. ఈ సమావేశం తరువాత, జగన్ మోహన్ రెడ్డి, వివిధ కేంద్ర మంత్రులను కలిసారు.

delhi 26082019 2

ముందుగా జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో, విడిగా భేటీ అయ్యారు. దాదపుగా 40 నిమషాల పాటు అమిత్ షా తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్తితుతల పై, జగన్ మోహన్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా పోలవరం రీటెండరింగ్ విషయం పై చర్చించారు. ఏ సందర్భంలో వెళ్ళింది వివరించారు. అలాగే హైకోర్ట్ అక్షింతల పై కూడా అమిత్ షా కు జగన్ వివరించారు. అలాగే, విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై, అన్ని ఒప్పందాలు కాకుండా, కొన్ని ఒప్పందాలు మాత్రమే చూస్తున్నామని అన్నారు. ఇక విజయసాయి రెడ్డి, అన్ని విషయాలు మోడీ, అమిత్ షా లకు చెప్పే చేస్తున్నామని, వారి ఆశీర్వాదంతోనే అన్ని పనులు చేస్తున్నాం అన్ని చేసిన వ్యాఖ్యల పై, బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉందని గ్రహించిన జగన్, ఆ విషయం పై కూడా అమిత్ షా కు వివరణ ఇచ్చారు.

delhi 26082019 3

ఏ సందర్భంలో, విజయసాయి రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసింది వివరించారు. ఇక అమిత్ షా తో భేటీ తరువాత, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి ఇచ్చిన జర్క్ తో, జగన్ అవాక్కయ్యారు. గజేంద్ర సింగ్ షెకావత్‌తో పోలవరం విషయం, రీటెండరింగ్ విషయం, కోర్ట్ విషయాలు అన్నీ చర్చించి, భేటీ పూర్తయి జగన్ బయటకు వస్తున్న సమయంలో, జగన్ కు కేంద్ర మంత్రి జర్క్ ఇచ్చారు. ఇప్పుడు హోం మంత్రి, జల శక్తి మంత్రిని, కలిసిన జగన్, రేపు ఆంధ్రప్రదేశ్ వెళ్లి, మాకు వాళ్ళ ఆశీర్వాదం ఉందని చెప్తారు అంటూ, జగన్‌ పై ఛలోక్తులు విసిరారు. దీంతో జగన్ అవాక్కయ్యారు. ఆయన ట్రేడ్ మార్క్ నవ్వు నవ్వి వచ్చేశారు. అయితే, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కేంద్రం ఎంత ఆగ్రహానికి గురైంది అని చెప్పేదానికి, ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు, కేంద్ర మంత్రి చేసిన ఈ కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read