అమరావతిలో కన్నా హైదరాబాద్ లోనే నిర్మాణ వ్యయం ఎక్కువని చంద్రబాబు అన్నారు. గుంటూరులో టిడిపి నేతలతో భేటిలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల పై ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగుల రాతపరీక్షకు రూ.5లక్షలు, రూ.10లక్షలు ఇస్తే ప్రశ్నాపత్రం ఇస్తామని దళారులే చెబుతున్నారంటే వైసిపి ప్రభుత్వ నిర్వాకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని అన్నారు. 10 లక్షలకు పేపర్ ఇస్తాం అంటూ తనకు కూడా ఎస్ఎంఎస్ వచ్చిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే చెప్పడం రాష్ట్రంలో దుస్థితికి అద్దం పడుతోందని, ఇంతకంటే సిగ్గు చేటు, ఈ ప్రభుత్వానికి ఏమి ఉంటుందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

cbn 29082019 2

పారదర్శకత, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పకడ్బందీ నిర్వహణ ఇవన్నీ నోటిమాటలే తప్ప ఆచరణ శూన్యం అని చంద్రబాబు అన్నారు. గ్రామ వాలంటీర్ల పోస్టుల కోసం రూ.20వేల నుంచి రూ.40వేల వరకు చెల్లించామని ఎంపికైన వారే చెబుతున్నారని, బాధ్యతలు చేపట్టగానే గ్రామ వాలంటీరు జనన ధ్రువీకరణ పత్రం కోసం సత్యవేడు మండలంలో రూ.5వేలు డిమాండ్ చేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. వైసిపి కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే లక్షలాది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని, చంద్రబాబు అన్నారు. వైసిపి నేతల బెదిరింపులు-వేధింపులు తట్టుకోలేకే ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు,ఆరోగ్య కార్యకర్తలు,అంగన్ వాడి వర్కర్లు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు.

cbn 29082019 3

ఉన్న ఉద్యోగాలను ఊడబీకి వాటిలో వైసిపి కార్యకర్తలను నింపడం గర్హనీయం అని అన్నారు. ఇంత పెద్దఎత్తున రాష్ట్రంలో చిరుద్యోగులు రోడ్లెక్కి ఆందోళనలు చేయడం వారిలో నెలకొన్న అభద్రతకు అద్దం పడుతోందని అన్నారు . పేదల పొట్టకొట్టి వైసిపి కార్యకర్తల పొట్టనింపే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, దీని కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని అన్నారు. అలాగే టిడిపి నేతల పై పెడుతున్న కేసుల పై కూడా స్పందించారు. "శ్రీకాకుళం జిల్లాలో టిడిపి నేత కూన రవికుమార్ పై కేసు పెట్టారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు పెట్టారు. పునుగుపాడు వెళ్లిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల బృందంపై కేసులు పెట్టారు.గతంలో ఎమ్మెల్యే బెందలం అశోక్ పై దాడి చేశారు. కొండెపి ఎమ్మెల్యే స్వామిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఖండిస్తున్నాం. అదే వైసిపి ఎమ్మెల్యేలు జర్నలిస్ట్ లపైనే దాడులు చేసినా, ఫోన్ లో బెదిరించి దుర్భాషలాడినా కేసులు నమోదు చేయక పోవడం గర్హనీయం." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read