జగన్ ప్రభుత్వం, రాజధాని అమరావతిని తరలిస్తుంది అనే, ఏకంగా మంత్రులే ప్రకటన చెయ్యటం, ఇంత గొడవ జరుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడక పొవటంతో, రాజధాని రైతులు ఆందోళన బాట పాట్టారు. రెండు రోజుల నుంచి, అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు. నిన్న ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ నే అడ్డుకునే ప్రయత్నం చేసారు. రాజధాని రైతులకు బీజేపీ, టిడిపి, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు అండగా నిలిచాయి. రైతులు కూడా, అటు కన్నా, ఇటు పవన్, అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని కలిసి, వారితో పోరాటానికి కలిసిరావాలని వివిధ పార్టీలను కోరారు. దీనికి అనుగుణంగా, నిన్న బీజేపీ నేతలు, రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతుల ఆందోళనకు మద్దతు పలికారు. మరో పక్క, నిన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య, కృష్ణా జిల్లా పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చారు.
స్వర్ణ భారతీ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గున్నారు. అలాగే ఉప రాష్ట్రపతి అయ్యి రెండేళ్ళు అయిన సందర్భంలో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, అమరావతి రైతులు, వెంకయ్యను కలిసి, తమ బాధలు చెప్పుకున్నారు. తమకు సొంత కుటుంబ సభులతో సమానమైన భూమిని, ఆనాడు చంద్రబాబు మీద నమ్మకంతో, రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలని, రాష్ట్రాభివృద్ధి కోసం, భూములు ఇచ్చామని అన్నారు. అటు రాష్ట్రం బాగుపడుతుంది, ఇటు మా జీవితాలు కూడా బాగుపదతాయని అనుకున్నామని వారు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, రాజధాని అమరావతి మారిపోతుందని, ప్రభుత్వంలోనే మంత్రులే ప్రతి రోజు చెప్తున్నారని, దీనికి తగ్గట్టుగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయని రైతులు వెంకయ్య దృష్టికి తీసుకొచ్చారు.
తమకు న్యాయం చెయ్యాలని, అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, అమరావతి మార్చకుండా సూచనలు ఇవ్వాలని వారు ఉప రాష్ట్రపతి వెంకయ్యను కోరారు. దీని పై స్పందించిన వెంకయ్య నాయుడు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున, అమరావతి మార్పు పై ఎటువంటి అధికారిక ప్రకటన విడుఅల కాలేదు కదా, మీరు ఆందోళన చెందకండి అని అన్నారు. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను అని, రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నని, రాజకీయాలు మాట్లాడకూడదు అని, కాని, రాజ్యాంగబద్ధంగానే ఈ విషయం పై తన నిర్ణయం ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. మీరు ధైర్యంగా ఉండండి, ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు అని రైతులకు ధైర్యం చెప్పారు. మీ తరుపున ఏమి చెయ్యగలనో, ఎంత చెయ్యగలనో, అక్కడి వరకు వెళ్లి అన్నీ చేస్తానని వెంకయ్య అన్నారు.