కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పై, రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ లో భాగంగా, సుజనా చౌదరి, సెంట్ భూమి కూడా అమరావతిలో లేదని చెబుతున్నారని, కాని ఆయనకు చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయని, అలాగే సుజనా సోదరుడి కుమార్తె రుషికన్యకి వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉన్నాయని బొత్సా చెప్పారు. సుజనాచౌదరికి ఉన్న 120 కంపెనీల్లో ఒకటైన గ్రీన్‌టెక్ కంపెనీ పేరుతొ, అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసారని ఆరోపించారు. అయితే బొత్సా వ్యాఖ్యల పై అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు సుజనా చౌదరి. బొత్సా ప్రెస్ మీట్ పెట్టిన గంటలోనే, వివిధ ఛానెల్స్ లో మాట్లాడిన సుజనా, బొత్సా వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.
బొత్సా ఎందుకు ఇంత లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. సీనియర్ అయిన బొత్సా తలతిక్క మాటలు మాట్లాడుతూ, ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని బొత్సా అన్నారు. వాళ్ళ ప్రభుత్వ లోపాలు , కప్పిపుచ్చుకునే పాట్లు లాగా ఇవి కనిపిస్తున్నాయని సుజనా అన్నారు. నాకు 120 కంపెనీలు ఉన్నాయని బొత్స అన్నారని, కాని ఆయన చెప్పిన కంపెనీ పేరు మాత్రం నాకు ఉన్న కంపెనీల్లో లేదని అన్నారు. అమరావతి రాజధాని పరిధిలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి, కృష్ణా జిల్లాలో లెక్కలు చెప్తున్నారని అన్నారు. బొత్సకు సీడ్ కేపిటల్ ఏదో, సీఆర్డీఏ పరిధి ఏదో తెలియదని సుజనా కౌంటర్ ఇచ్చారు. వీరులపాడు మండలం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని, అక్కడ మాకు ఎప్పటి నుంచి భూములున్నాయో తెలుసుకోవాలని అన్నారు.
ఆ భూములు ఎప్పుడూ కొన్నమో, ఆ రికార్డులు ఏంటో చూసుకుని మాట్లాడితే బాగుండేది అని అన్నారు. గుంటూరు జిల్లాలో రాజధాని ఉంటే, కృష్ణా జిల్లా పరిధిలో నాకు ఉన్న భూములు పై ఆరోపణలు చేసి, ఏదో జరిగి పోయింది అంటూ, తల తోక లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజధాని అంటే 29 గ్రామాలు అని, ఇక్కడ అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారనే విషయం బొత్సా గ్రహించాలని సుజనా అన్నారు. ఒక పక్క రాజధాని పై రోజుకి ఒక గందరగోళ ప్రకటన ఇస్తూ, అక్కడ రైతులకు క్లారిటీ ఇవ్వకుండా, ఆ విషయం డైవర్ట్ చెయ్యటానికి నా పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇన్ని విషయాలు చెప్పారు కదా, నిజంగానే దీంట్లో తేడా ఉంటే, నా పైన కేసు పెట్టుకుని, విచారించుకోండి అంటూ బొత్సాకు ఛాలెంజ్ విసిరారు.