వైజాగ్ టెస్ట్ మ్యాచ్ లో, ఘన విజయం సాధించి, దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు దసరా సంబరాలను రెట్టింపు చేసిన టీం ఇండియాకు, మన వైజాగ్ పోలీసులు పలికిన వీడ్కోలు, విమర్శలకు తావు ఇచ్చింది. ఈ రోజు తిరుగు ప్రయాణం అయిన టీం ఇండియా క్రికెటర్లకు, విశాఖపట్నం విమానాశ్రయంలో కుటుంబ సభ్యులతో సహా ఇబ్బందులు పడ్డారు. వైజాగ్ పోలీసుల అవగాహన లోపంతో, కుటుంబ సభ్యలతో కలిసి, వర్షంలో తడుస్తూ ఎయిర్ పోర్ట్ లోపలకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్క లగేజీ, ఒక పక్క కుటుంబ సభ్యులతో, వర్షంలో తడుస్తూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. వైజాగ్ లో, దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం మ్యాచ్‌ ముగిసింది. దీంతో ఇరు జట్ల క్రీడాకారులు, ఈ రోజు తిరుగు ప్రయాణం అయ్యారు.

vizag 07102019 2

సోమవారం ఇరు జట్లు పుణెకు బయల్దేరాయి. వారు బసచేసిన హోటల్ నుంచి క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన బస్సులో విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అయితే, ఎయిర్ పోర్ట్ లో మూడు ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. స్థానిక పోలీసుల అవగాహన లోపంతో భారత క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సును మూడో ఫ్లాట్‌ఫారం వద్దకు తీసుకు వెళ్లి ఆపారు. అక్కడ ఎలాంటి షల్టర్ లేదు. బస్సు దిగగానే వర్షం పడుతూ ఉండటంతో, అలాగే తడుచుకుంటూ లోపలకి వెళ్లారు. లగేజీ, కుటుంబ సభ్యులు ఉండటంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. మరో పక్క, మొదటి ఫ్లాట్‌ఫారంలో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళను దింపారు. అక్కడ షల్టర్ ఉంది. దీంతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

vizag 07102019 3

అయితే బస్సు అటు వైపు ఎందుకు పార్క్‌ చేయలేదని ఎయిర్‌పోర్ట్‌ సీఐని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ప్రశ్నించగా, మొదటి ఫ్లాట్‌ఫారంలో దక్షిణాఫ్రికా జట్టు ప్రయాణిస్తున్న బస్సును నిలిపారని చెప్పారు. అయితే, పెద్ద వర్షం పడుతూ ఉండటం, కుటుంబ సభ్యులు ఉండటంతో, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిన తరువాత, భారత ఆటగాళ్ళను కూడా అటు వైపు నుంచి తీసుకు వెళ్ళకపోవటం పై విమర్శలు వస్తున్నాయి. లేకపోతే కుటుంబ సభ్యలకు గొడుగులు లాంటివి ఇవ్వాల్సింది అనే వాదన వినిపించింది. క్రికెటర్లు ఎప్పుడు వైజాగ్ వచ్చినా, సిటీని పొగుడుతూ ఉండేవారు. అలాంటి వారికి, తగిన గౌరవం మనం ఇవ్వాల్సింది. ఏది ఏమైనా, ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా, యంత్రాంగం చూసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read