జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే, అప్పటికే ఉన్న పాత కాంట్రాక్టుర్లకు పనులు ఆపేసి, కొత్త కాంట్రాక్టుర్లకు పనులు అప్పగించే పనులు మొదలు పెట్టారు. దీని కోసం రివెర్స్ టెండరింగ్ అనే విధానం తెచ్చారు. అయితే, ఇప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ విధానం బ్యాంకులను కూడా ఇబ్బంది పెడుతుంది. బ్యాంకులకు, రివర్స్ టెండరింగ్ తో ఇబ్బంది ఏంటి అనుకుంటున్నారా ? ఏ బ్యాంక్ అయినా ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే దానికి రుణాలు ఇవ్వటం సహజం. ఆ కంపెనీకు ఉన్న హిస్టరీ, సామర్ధ్యం, చేస్తున్న ప్రాజెక్ట్, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని లోన్ ఇస్తారు. అదే ప్రభుత్వ ప్రాజెక్ట్ అయితే, ఎలాంటి ఆలోచన చెయ్యకుండా రుణం ఇస్తారు. ఎందుకంటే, ఈ కాంట్రాక్టుర్ చేసేది ప్రభుత్వ పని కాబట్టి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అనే ధీమా, బ్యాంకులకు ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ప్రవేశపెట్టిన రివెర్స్ టెండరింగ్ తో, బ్యాంకులకు కూడా కొత్త కష్టాలు వచ్చాయి.
ఇది వరకు ప్రభుత్వంలో, కాంట్రాక్టర్ లకు పనులు ఇచ్చి ఉన్నారు. ఆయా ప్రాజెక్ట్ లకు బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉన్నాయి. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ విధానంతో, కొత్త వారికి పనులు అప్ప చెప్పుతూ, పాత కాంట్రాక్టుర్లను రద్దు చేస్తున్న నేపధ్యంలో, ఇప్పటికే పాత కాంట్రాక్టుర్లకు, ఈ ప్రాజెక్ట్ ఉంది అనే ధీమాతో రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఇచ్చిన రుణం ఎలా తిరిగి వస్తుందా అని, ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో, స్టేట్బ్యారకు మేనేజిరగ్ డైరెక్టర్, జగన్ మోహన్ రెడ్డిని ఇదే విషయాన్ని అడిగినట్టు సమాచారం సమాచారం. స్టేట్ బ్యాంక్ తో పాటుగా, ఇతర బ్యాంకులు కూడా, ఇదే విధంగా ఆర్ధికశాఖను వివరాలు కోరుతున్నాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి రోడ్డు నిర్మాణాలకు, విద్యుత్ సంస్థలకు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి పనులకు వివిధ బ్యాంకుల నుంచి, ఈ ప్రాజెక్ట్ లు చేసే కాంట్రాక్టుర్లు రుణాలు తీసుకున్నారు. కొంత మంది పెద్ద కాంట్రాక్టుర్లు కూడా, ఇక్కడ బ్యాంకులే కాకుండా, విదేశీ బ్యాంకుల నుంచి కూడా అప్పు తీసుకున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కారణంగానే తాము రుణాలిచ్చామని, ఆ హామీని ప్రస్తుత ప్రభుత్వం గౌరవించడం లేదన్న అభిప్రాయం బ్యాంకర్లలో వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి ప్రభుత్వం మాత్రం, పాత కాంట్రాక్టులు అన్నీ రద్దు చేసి కొత్త వారికి ఇస్తున్నారు. ఇదే విషయం పై, కొన్ని బ్యాంకులు, కేంద్రం ఆర్ధిక శాఖ ద్రుష్టికి కూడా తీసుకువెళ్ళాయి. ఇప్పుడు నిర్మాణ సంస్థలను మార్పు చేస్తే, ఇప్పటికే తాము ఇచ్చిన రుణాల పరిస్థితి ఏంటి అనే ఆందోళన బ్యాంకర్లలో వ్యక్తమవుతోంది.