వైసీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి చేసిన చర్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎందుకు ఇలా చేసారు అంటూ, తీవ్ర చర్చ నడుస్తుంది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఆయన సతీమణి దేవికారాణి విషయంలో విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చూసి అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. రవిప్రకాశ్ వందలాది కోట్ల రూపాయల మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారాని, అతని పై సిబిఐ, ఈడీ చేత విచారణ చేపించాలని, విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కి లేఖ రాసారు. ఆర్బీఐ, ఐటీ నిబంధనలు, కంపెనీల చట్టాన్ని ఉల్లంఘిస్తూ, విదేశీ బ్యాంకుల్లో రవి ప్రకష్ వేల కోట్ల నల్ల డబ్బు దాచుకున్నారని విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసారు. రవిప్రకాశ్ తన హోదాను ఉపయోగించుకుని బ్లాక్మెయిల్ వ్యవహారాలకు పాల్పడ్డారని, న్యూస్ చానళ్లు, సోషల్ మీడియాను ఉపయోగించుకుని , వేల కోట్ల డబ్బులు వెనకేసుకున్నాడని, విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసారు.
అంతే కాదు, మొసద్దీలాల్ జువెలర్స్‌కు చెందిన సుకేశ్ గుప్తాతో కలిసి పలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని, సతీష్ సానాతో కూడా లింకులు ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. నిజానికి సతీష్ సానా, జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుకున్న కోనేరు మధుకు, బెయిల్ ఇప్పించటం కోసం, లంచాలు తీసుకున్నారని, అతని పై ఆరోపణలు ఉన్నాయి. దానికి బొత్సా, షబ్బీర్ అలీ కూడా సాక్ష్యం అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా, ఇప్పుడు విజయసాయి రెడ్డి చర్య ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ముందుగా ఏదైనా కంప్లైంట్ ఉంటే, కేంద్రానికి కాని, సిబిఐ , ఈడీలకు కాని చెప్తారు. వాళ్ళు పట్టించుకోక పొతే అప్పుడు సుప్రీం కోర్ట్ కు వెళ్తారు. అది కూడా పిటీషన్ రూపంలో కేసు ఫైల్ చేస్తారు.
ఇక్కడ విజయసాయి రెడ్డి మాత్రం లేఖ రాసారు. జగన్ కేసులో కూడా, అన్ని ఆధారాలతో కోర్ట్ లో పిటీషన్ వేస్తే, అప్పుడు కోర్ట్ ముందుకు వెళ్ళింది. మరి ఇక్కడ విజయసాయి రెడ్డి ఇలా ఎందుకు చేసారు అనే చర్చ కొనసాగుతుంది. అందులోను, ప్రస్తుతం కేంద్రంలో విజయసాయి రెడ్డికి పలుకుబడి ఉంది. మరి కేంద్రంతో చెప్పి, రవి ప్రకాష్ మీద అన్ని ఆధారాలు చూపించి, సిబిఐ, ఈడీ విచారణ కోరవచ్చు. అలా ఎందుకు చెయ్యలేదు ? కేంద్రంలో విజయసాయి రెడ్డి మాట వినటం లేదా ? సుప్రీంలో కేసు వెయ్యకుండా, లేఖ ఎందుకు రాసారు ? కేవలం ప్రచారం కోసమేనా ? ప్రస్తుతం రవి ప్రకాష్ కు, తెలంగణాలో ఉన్న మేఘా, రామేశ్వర రావుకి యుద్ధం జరుగుతుంది. అందులో భాగంగానే, రవి ప్రకాష్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కేసిఆర్ మెప్పు పొందటానికి, విజయసాయి ఇలా చేసారా ? అయినా ఇప్పటికే తన పై ఉన్న 11 సిబిఐ, 5 ఈడీ కేసుల విషయంలో విచారణ ఎదుర్కుంటూ, ఇలా ఇతరుల పై కేసులు పెడితే, అవతలి వారు నమ్ముతారా ? చూద్దాం ఏమి జరుగుతుందో ?