భారతీయ జనతా పార్టీ నేత , కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు విజయవాడ పర్యటనలో చుక్కలు కనిపించాయి. ఆయన హోదా పక్కన పెట్టి, వయసును ద్రుష్టిలో పెట్టుకుని అయినా, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సంఘటన విజయవాడ ఇంద్రకీలాద్రి పై జరిగింది. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ గుడిలోనే, కృష్ణం రాజుకి అవమానం జరిగిందని బీజేపీ నేతలు వాపోతునారు. మాజీ కేంద్ర మంత్రి అయినా, కృష్ణంరాజుకి కనీస గౌరవం ఇవ్వడానికి కాని, లేక ఆయన వయసుని ద్రుష్టిలో పెట్టుకుని అయినా, ఆయనకు సహకరించటానికి అధికారులెవరూ సిద్ధపడలేదు. ఇంద్రకీలాద్రిలో ఉన్న ఒక్క కానిస్టేబుల్స్ కాని, దుర్గగుడి అధికారులు కాని, అయన మోర ఆలకించలేదు, ఆయన్ను పట్టించుకోలేదు. కనకదుర్గ అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గుంటానని, తగిన విధంగా సహకరించాలని, ముందుగా దుర్గగుడి అధికారులకు, కృష్ణం రాజు సమాచారం ఇచ్చారు.
దీంతో ఆయన కుటుంబంతో సహా ఇంద్రకీలాద్రి వచ్చారు. అయితే భక్తులు అధికంగా ఉండటంతో, అధికారులు ఎవరూ ఆయన వద్దకు రాలేదు. అయితే విషయం ఎవరికి చెప్పినా, ఒక్కరంటే ఒక్క అధికారి కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దాంతో ఆయనే స్వయంగా కుటుంబంతో సహా ఆరో అంతస్తుకు వెళ్లారు. వయోభారం కావటంతో, ఆయన అన్ని అంతస్తులు ఎక్కటానికి, తీవ్ర ఇబ్బంది పడ్డారు. సామాన్య భక్తులతో పాటు వెళ్లడంతో, తోపులాటలో, తీవ్ర ఇబ్బంది పడ్డారు. పైకి ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నానని అధికారులకు ఎంత చెప్పినా, ఆయనకు ఎవరూ సహకరించ లేదు. ఆయన పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. కుంకుమార్చన జరిగే ప్రదేశానికి వెళ్లడానికి కృష్ణంరాజు చాలా అవస్థలు పడ్డారు. పైకి ఎక్కుతూ, కొన్నిసార్లు ఆయాసంతో కూర్చుండిపోయారు.
చివరికి అతి కష్టం మీద పైకి ఎక్కి పూజలు చేసారు. కృష్ణంరాజునుకావాలనే ఇలా ఇబ్బంది పెట్టారని బీజేపీ విమర్సిస్తుంది. ఆయన ఒక మాజీ కేంద్ర మంత్రి అని, అలా కాకపోయినా, కనీసం మానవాతా వాదంతో అయినా స్పందించాలి కదా అని కోరారు. సాచిన్న చిన్న వైసీపీ నేతలు వస్తేనే, హడావిడి చేస్తూ, వారిని, వారి బంధువులకు సకల మర్యాదలు చేస్తున్నఆలయ అధికారులు, మాజీ కేంద్రం మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని, బీజేపీ ప్రశ్నిస్తుంది. సామాన్య భక్తుల కోసం కూడా సరైన ఏర్పాట్లు చేయలేదని వార్తల్లో చూస్తున్నామని, వైసీపీ నేతలు, వారి అనుచరులకు మాత్రం, పెద్ద పీట వేస్తున్నారని, అధికారులు కూడా ఇలా ప్రవర్తించటం దారుణం అని అంటున్నారు. కృష్ణంరాజు ముందస్తుగా సమాచారం పంపినప్పటికీ., ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఇబ్బంది పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది.