తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ మసకబార్చేలా, భక్తులమనోభావాలు దెబ్బతినేలా జగన్ చర్యలున్నాయని, ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారికి ఉన్న మహిమను మంటగలి పేలా వైసీపీ ప్రభుత్వం తిరుమలలో అన్యమత ప్రచారానికి పూనుకుందని టీడీపీనేత, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్ పదవిని బీసీలకు, ముఖ్యంగా హిందూమత విశ్వాసకులకు అప్పగిస్తే, వైసీపీ ప్రభుత్వం అందుకు పూర్తివిరుద్ధంగా వ్యవహరించిందన్నారు. టీటీడీబోర్డులో తెలంగాణకు అధిక ప్రాముఖ్యతనిచ్చిన జగన్మోహన్‌రెడ్డి, తనకేసుల్లో దోషులుగా ఉన్నవారిని బోర్డుసభ్యులు గా నియమించారని మండిపడ్డారు. టీటీడీబోర్డు సభ్యులైన శ్రీనివాసన్, పరిగెల మురళీకృష్ణ లపై పలుకేసులు, నేరచరిత్ర ఉన్న విషయాన్ని ఎమ్మెల్సీ గుర్తుచేశారు. టీటీడీచైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్యమతస్తుడని, ఆయనకు కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ, భక్తులనమ్మకాలపై లేదన్నారు.
తిరుమలవెళ్లే బస్సుల్లో టిక్కెట్లపై అన్యమతప్రచారం చేస్తున్నారని చెప్పారు. స్వామివారి నగలను సింగపూర్‌కు తరలించారని, పింక్‌డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని గతంలో ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకున్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై ఎందుకు పెదవివిప్పడంలేదని శ్రీనివాసులు ప్రశ్నించారు. ఇప్పుడు జేఈవోగా ఉన్న ధర్మారెడ్డి స్వామివారి నగల్లో అసలు పింక్‌డైమండ్ అనేదేలేదని చెప్పడం జరిగిందని, దాన్నిబట్టే విజయసాయిరెడ్డి తిరుమలపవిత్రతపై ఎంతటి అడ్డగోలు ఆరోపణలుచేశాడో అర్థమవుతోందన్నారు. చంద్రబాబుపై, తెలుగుదేశంపై అసత్యప్రచారం చేసినందుకు, స్వామివారి నగలు, ఆభరణాలను రాజకీయ అంశాలుగా వాడుకున్నందుకు వైసీపీనేతలు, విజయసాయిరెడ్డి చంద్రబాబుగారికి బహిరక్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు.
ఇక మరో నేత సుజయకృష్ణ రంగారావు మీడియాతో మాట్లాడుతూ, నాలుగునెలల్లోనే రాష్ట్రప్రజల నమ్మకాన్ని కోల్పోయిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రానికి రుణమిచ్చే బ్యాంకుల నమ్మకాన్ని కూడా కోల్పోయిందని, ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకంలేదని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రిరంగారావు వ్యాఖ్యానించారు. రూ.3000 కోట్లరుణం కావాలంటూ జగన్మోహన్‌రెడ్డి సర్కారు చేసిన విజ్ఞప్తిని ఎస్‌బీఐ తిరస్కరించడం ప్రభుత్వానికి సిగ్గచేటన్నారు. ప్రభుత్వ పనితీరు సక్రమంగా ఉండి, ఆయాప్రభుత్వాలపై బ్యాంకులకు విశ్వసనీయత ఉన్నప్పుడే అవిరుణాలు ఇవ్వడానికి మొగ్గుచూపుతాయన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్యారంటీలు ఇవ్వచూపినా కూడా తామురుణం ఇవ్వలేమని ఎస్‌బీఐ చెప్పిందంటే, ఆ సంస్థకు ప్రభుత్వం పై ఎంతవిశ్వసనీయత ఉందో అర్థమవుతోందన్నారు. గతప్రభుత్వ విధానాలను, నిర్ణయా లను తప్పుపడుతూ, జగన్మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న పద్ధతులను తప్పుపడుతూ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివన్నారు. జగన్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలవల్లే మొన్న ప్రపంచబ్యాంక్, నిన్న ఏసియన్ డెవలప్‌మె ంట్ బ్యాంక్, (ఏడీబీ), నేడు ఎస్‌బీఐ నిధులివ్వకుండా ముఖంచాటేశాయన్నారు.