బైబై బాబు అంటూ వైకాపా కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసం వద్ద నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్తలు పార్టీ పతాకాలతో ర్యాలీగా చంద్రబాబు నివాసం వైపు వచ్చారు. బైబై బాబు అంటూ నినదిస్తూ బాణాసంచా కాల్చేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు నివారించారు. ఇంతలో తెదేపా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అరగంటసేపు వైకాపా కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల జోక్యంతో వారు వెనుదిరిగారు.

 
మరో పక్క, ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడంతో గురువారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వెలవెలబోయింది. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉంటే గెలిచిన టీడీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సీఎం నివాసానికి తరలివస్తారని భావించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకే కరకట్ట పరిసరాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పార్టీ గెలిస్తే విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. మంగళ వాయిద్యాలు తెప్పించారు. కానీ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నుంచే ప్రతిపక్ష వైసీపీ ఆధిక్యం కనబర్చడంతో సీఎం నివాసం దగ్గర సందడి లేకుండా పోయింది. ఒక దశలో కుప్పంలో చంద్రబాబు వెనుకంజలో ఉండడంతో సీఎం నివాసం వద్ద ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. తర్వాత చంద్రబాబుకు మెజార్టీ రావడంతో పార్టీ నేతలు ఊపిరి తీసుకున్నారు
Advertisements

Advertisements

Latest Articles

Most Read