దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలపై ఆదివారం సాయంత్రం పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ సర్వేలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సర్వే ఫలితాలను కొన్ని పార్టీల అధినేతలు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నమ్ముతుండగా.. మరికొందరు ఇవన్నీ ప్లాప్ అవుతాయని అసలు ఫలితాల కోసం మే-23 వరకు వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరోసారి స్పందించారు. ఏపీలో నూటికి వెయ్యిశాతం గెలిచేది టీడీపీనేనని బాబు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. తాను ఒక్క పిలుపు ఇస్తే వరదలా వచ్చి ఓటేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

cbn reaction 20052019

లైన్ లో ఉండి, అర్ధరాత్రి కూడా ఓటు వేశారంటే, అది జగన్ కోసమా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. సర్వేలు చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిందన్నారు. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం ఎప్పుడూ జరగలేదని.. ఇందులో ఒక్కశాతం కూడా అనుమానం లేదన్నారు. వందశాతం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. టెక్నాలజీకి బానిసగా మారొద్దని.. బలిపశువులు కావొద్దని చంద్రబాబు సూచించారు. గతంలో ఈవీఎంలో ఎవరికి ఓటు పడిందో తెలిసేది కాదన్నారు. ఇంకా ఫలితాలు రాక ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఏర్పాటు చేసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల ఆనందం ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు.

cbn reaction 20052019

చివరికి ఎన్నికల కమిషన్‌లోనే లుకలుకలు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రంలో ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు చేశామని, అన్ని పార్టీలు ఈవీఎంలను కాపాడుకోవడంలో బిజీగా ఉన్నాయని అన్నారు. ఈవీఎంలు ఎత్తుకెళ్లే అవకాశాలు చాలా తక్కువని, ఫ్రీక్వెన్సీ మార్చవచ్చునని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రూ.9 వేల కోట్లు ఖర్చుపెట్టి వీవీప్యాట్లు తీసుకొచ్చారన్నారు. ఫామ్‌-7 ద్వారా టీడీపీకి పడే ఓట్లను తొలగించారని విమర్శించారు. ఐపీ అడ్రస్‌లు అడిగితే ఇవ్వలేదపి, తిసేశామని చెప్పారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. రోజురోజుకు ప్రజల అనుమానాలకు బలం చేకూరుస్తున్నారని బాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read