దేశ వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన తరువాత, మోడీ, అమిత్ షా తమ మార్కు రాజకీయాలకు పదును పెట్టారు. గత కొన్నిరోజులుగా నాన్ బిజెపి పార్టీలను ఒక దగ్గరకు తేవడానికి టిడిపి అధినేత చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలతో బెంబేలెత్తిన మోడీ బ్యాచ్, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ టాలెంట్ చూపించారు. పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ మీడియాలో అన్ని సర్వేలు తమకు అనుకూలంగా చెప్పుకుని, ఎన్‌డిఎకు గతంలో కన్నా..ఎక్కువ సీట్లు వస్తాయని ఢంకా బజాయించడంతో, అప్పటి వరకు చంద్రబాబు వెంట ఉన్న పార్టీలు అవాక్కు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి నాన్ బిజెపి పార్టీలను ఒక గూటి కిందకు తెచ్చి..బిజెపికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోన్న చంద్రబాబుకు 'గ్జిట్‌పోల్స్‌తో మోడీ దెబ్బ కొట్టారా అంటే, అవును అనే చెప్పాలి.
జాతీయ మీడియా సంస్థలు వెలవరించిన ఎగ్జిట్‌పోల్స్ నిజం అవుతాయని భావించకపోయినా, మోడీ,బిజెపికి గెలిచే పార్టీగా ముద్ర వేయడం, యుపిఎ, చంద్రబాబుల స్థైర్యాన్ని దెబ్బతీశాయని చెప్పవచ్చు. అయితే మోడీ అండ్ కో ఇలా చేస్తారని, ఎగ్జిట్‌పోల్స్ గురించి బెంబేలెత్తాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ ఎగ్జిట్‌పోల్స్ ప్రభావం ప్రజల్లో పెద్దగా లేకపోయినా, పార్టీలు మాత్రం కంగారు పడేలా చేసాయి. మోడీ అండ్ కో వేసిన ఎగ్జిట్‌పోల్స్ ఎత్తుగడ పనిచేసిందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు బిజెపికి దూరంగా, కాంగ్రెస్ లేక కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన పార్టీలు, ..ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూడడానికి భయపడుతున్నాయి. ఇప్పుడే కాంగ్రెస్ వద్దకు చేరితే, ఒక వేళ మోడీ మళ్ళీ వస్తే, తమ అంతు చూస్తారని, అందుకే ఇప్పుడే బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు.
బీఎస్పీ అధినేత మాయావతి నిన్న సోనియాగాంధీ'ని కలవాల్సింది. కానీ ఆమె తన పోగ్రామ్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమె ఢిల్లీకి వెళ్లడం లేదని తెలుస్తోంది. అయితే ఎగ్జిట్‌పోల్స్ వల్లే ఆమె సోనియాతో సమావేశం కావడం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలానే మరి కొన్ని పార్టీలకు ఎగ్జిట్‌పోల్ భయం పట్టుకుంది. మొత్తం మీద..నిన్నటి వరకు కొద్దిగా యుపిఎకు అనుకూలంగా ఉందనుకున్న పరిస్థితిని మోడీ రాత్రికి రాత్రి మార్చేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో మోడీ వ్యతిరేకులను కూడగడుతున్న చంద్రబాబును దెబ్బ కొట్టారు. అయితే ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇటువంటి వాటికి జంకే ప్రసక్తేలేదు. ఎగ్జిట్స్‌పోల్స్ మొదటి నుంచి తాను చెప్పినట్లే వచ్చాయని, దీనిలో కొత్తేమీ లేదని, తాను ఈవిఎంలపై తలపెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. మొత్తం మీద, ఈ సంవత్సరన్నర కాలంలో, మొదటి సారి, మోడీ చంద్రబాబు పై, ఫేక్ ఎగ్జిట్ పోల్స్ చూపించి, పై చేయి సాదించారు.