మే 10వ తేదీన టీవీ9 కార్యాలయంలోకి రోజూ మాదిరిగానే వెళుతున్న రవిప్రకాష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోపల వాటాదారుల సమావేశం జరుగుతోందని, బలవంతంగా కార్యాలయంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే కస్టడీలోకి తీసుకుంటామని రవిప్రకాష్‌కు పోలీసులు బదులిచ్చారు. అనంతరం టీవీ9 సీఈవో బాధ్యతల నుంచి రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించడం, కొత్త సీఈవోను ప్రకటించడంతో టీవీ9తో రవిప్రకాష్‌కు ఉన్న అనుబంధం దాదాపుగా తెగిపోయింది. అప్పటి నుంచి రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినా స్పందిచలేదు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. నేడు విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది.

revanth 15052019

ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు రవిప్రకాష్ అజ్ఞాతం నుంచే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఎక్కడున్నారో తెలియదు గానీ ఆయన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను బయటపెట్టారు. మై హోం రామేశ్వరరావు 2016లోనే టీవీ9ను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో తమను సంప్రదించినట్లు రవిప్రకాష్ చెప్పారు. అయితే.. అందుకు తాను అందుకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. రామేశ్వరరావు ఆలోచన వెనుక రాజకీయ అజెండా ఉందని, పైగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఆయన చినజీయర్ స్వామి అనుచరుడని తెలిపారు. తన రాజకీయ, సైద్ధాంతిక సిద్ధాంతాలను జొప్పించే ఉద్దేశంతో టీవీ9ను టేకోవర్ చేసుకోవాలని భావించారని, అందుకే తాను ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని రవిప్రకాష్ చెప్పారు.

revanth 15052019

2018 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ రైడ్స్ జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, ఆ సమయంలో తనకు న్యూస్‌రూమ్ నుంచి కాల్ వచ్చిందని రవిప్రకాష్ చెప్పారు. రేవంత్ రెడ్డి వార్తను ఎలా కవర్ చేయాలో రామేశ్వరరావు కుమారుడు, సోదరుడు డిక్టేట్ చేస్తున్నారని ఫోన్‌ చేసి తన స్టాఫ్ చెప్పినట్లు రవిప్రకాష్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రేవంత్ రెడ్డి వారికి రాజకీయ శత్రువు కావడంతో, ఆయనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారు ప్రయత్నించారని రవిప్రకాష్ చెప్పారు. ఏప్రిల్ 18, 2019న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయని, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ తాను కథనాన్ని ప్రసారం చేశానని రవిప్రకాష్ చెప్పారు. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని, అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. https://www.thenewsminute.com/article/battle-tv9-founder-ravi-prakash-says-businessman-staged-coup-wants-editorial-control-101798

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read