భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలపైనే ప్రపంచ దేశాల చూపు ఉంది. మోడీ హవా కూడా ఆ విధం గానే కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ ‘టైమ్‌’ మ్యాగజైన్‌ భారత ఎన్నికలపై ప్రత్యేకంగా అంతర్జాతీయ ఎడిషన్‌ను ప్రచురించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోను కవర్‌ పేజీపై ముద్రించింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ పక్కనే ఓ వివాదాస్పద శీర్షికను ప్రచురించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ (భారత దేశాన్ని విభజించేవాడు) అని రాసిన హెడ్‌లైన్‌ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మే 20, 2019న విడుదల అయ్యే ఈ మ్యాగజైన్‌ ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమ యంలో వివాదాలు సృష్టించేదిగా ఉంది. యూరప్‌, ఆసియా, మధ్య ప్రాశ్చ్యం, దక్షిణ పసిఫిక్‌ అంతర్జా తీయ ఎడిషన్‌లలో మోడీ కవర్‌ స్టోరీ ప్రచురించింది. ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ కథనాన్ని అతిష్‌ తసీర్‌ రాశాడు. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం మరో ఐదేళ్లు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా..? అన్న హెడ్‌లైన్‌తో ఈ ఆర్టికల్‌ను రాశారు.

time 12052019

నెహ్రూ, మోడీకి మధ్య వ్యత్యాసం గురించి కూడా ఈ ఆర్టికల్‌లో ఉంది. మోడీ హయాంలో హిం దు-ముస్లిం సంబంధాలు, మోడీని తిట్టడం ద్వారా హిందూ అనుకూలమైన వ్యక్తులుగా నిరూపించుకోవడం వంటి ఆధారంగా ఆ వ్యాసం రాసినట్టు తెలుస్తున్నది. మోడీ ప్రభు త్వ హయాంలో వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, క్రిస్టియన్లు అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. 2014 ఎన్నికల సందర్భంగా ఆర్థికపరమైన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని, మోడీ ప్రధాని అయ్యాక ఆర్థికంగా ఎలాంటి అద్భుతాలు జరగలేదని తసీర్‌ అభిప్రాయపడ్డాడు. భారత దేశంలో నేషనలిజం అనే అంశం పెరిగిందే తప్పా, ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పుకొచ్చారు. మాజీ ప్రధాని నెహ్రు లౌకికవాదాన్ని, మోడీ హయాంలో ప్రబలుతున్న సామాజిక ‘ఉద్రిక్తత’తో పోల్చుతూ తసీర్‌ కథనం సాగింది. బీజేపీ హిందుత్వ రాజకీయాలే భారత ఓటర్లు నిలువునా చీలడానికి కారణమని తసీర్‌ పేర్కొన్నా డు. 2014 ఎన్నికల తరు వాత స్వతంత్ర భార త రాష్ట్రాల ప్రాథమిక సిద్ధాంతాలు, దాని సమరయోధులు, మైనార్టీ స్థానం సహా దేశంలో అనేక వ్యవస్థల మధ్య తీవ్ర అపనమ్మ కాలు ఏర్పడ్డాయంటూ చెప్పుకొచ్చారు.

time 12052019

భారత ప్రధాన లక్ష్యాలు అయిన లౌకికవాదం, ఉదారవాదం, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి వాటిని చాలా మంది అతిపెద్ద కుట్రలో భాగంగా చూస్తున్నారని టైమ్‌ కథనం పేర్కొంది. గుజరాత్‌ అల్లర్లపై మౌనం దాల్చిన కారణంగా మోడీ అల్లరి మూకలకు స్నేహి తుడిగా మారారంటూ తసీర్‌ విమర్శించారు. గోహత్యలపైనా మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని కూడా టైమ్‌ ప్రశ్నించింది. మోడీ ఐదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘటనల గురించి కూడా ప్రస్తావిం చారు తసీర్‌. మూకదాడులు, యోగీ ఆదిత్య నాథ్‌ను యూపీ సీఎంగా నియమించడ ం, సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ను భోపాల్‌ నుంచి బరిలో దించడం వం టి ఎన్నో అంశా లను ప్రస్తా వించడం జరిగింది. వీ టితో పాటు కాంగ్రెస్‌ గురించి కూడా కథ నంలో తసీర్‌ చర్చి ంచారు. కాంగ్రెస్‌ వారసత్వ రాజకీ యాలు మిన హా ఇంకేమీ చేయట్లేద ని ఆయన దుయ్యబ ట్టారు. తాజాగా రా హుల్‌ గాంధీకి తోడుగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా రాజకీయా ల్లోకి వచ్చారని తసీర్‌ చెప్పుకొ చ్చారు. ప్రియాంక వచ్చినా పెద్ద మార్పు కనబడటం లేదని పేర్కొన్నారు. ఇంతటి బలహీన ప్రతిపక్షం ఉండటం కూడా మోడీ ప్రభుత్వానికి బాగా కలిసివస్తుందని తసీర్‌ పేర్కొన్నారు. మోడీ చిత్రం టైమ్‌ మ్యాగ జైన్‌ కవర్‌ ఫొటోగా రావ డం ఇదే తొలి సారి కాదు. అదేవిధంగా మోడీ గురించి తీవ్రంగా దూషిస్తూ రాయడం కూడా మొదటి సారికాదు. 2012లో మోడీని వివాదాస్పదమైన, ఆశాభా వం కలిగిన, తెలివైన రా జకీయనాయకుడిగా టైమ్‌ మ్యాగజైన్‌ ఓ ఆర్టికల్‌ను కూడా ముద్రించింది. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీక రించి ఏడాది పూర్త యిన సం దర్భంగా కూడా టైమ్‌ మ్యాగ జైన్‌ మోడీ కవర్‌ ఫొ టోతో ప్రత్యేక ఎడిషన్‌ను ప్రచు రించింది. గుజరాత్‌ అల్లర్ల గురించి కూడా తసీర్‌ తన వ్యాసంలో గుర్తు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read