రాహుల్ గాంధీ పొరపాటున నోరు జారినా, తాను చెప్పాలి అనుకున్నది సరిగ్గా చెప్పకపోయినా, అతన్ని బీజేపీ ఐటి సెల్ ఎలా టార్గెట్ చేస్తుందో అందరికీ తెలుసు. ఇలా పొరపాట్లు మాట్లడుకున్నందుకు, రాహుల్ గాంధీని పప్పు అంటూ హేళన చేసేవారు కూడా. అయితే అన్ని శాస్త్రాలు తెలిసిన బీజేపీ పార్టీకి, ఇప్పుడు కర్మ సిద్దాంతం అంటే ఎంతో తెలిసి వచ్చింది. రాహుల్ గాంధీలాగా పొరపాటు కాదు, తనకు ఏదీ రాదని తెలిసినా, అన్నీ వచ్చు అంటూ ఎదో బిల్డ్ అప్ ఇచ్చి, మోడీ దొరికిపోయారు. బాలాకోట్‌ దాడుల వ్యూహరచనలో తన పాత్ర గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఊహించని తిప్పలు తెచ్చిపెట్టాయి. మబ్బుల చాటున ప్రయాణించడం ద్వారా పాకిస్థాన్‌ రాడార్ల నుంచి తప్పించుకోవచ్చని తాను వాయుసేనకు సలహా ఇచ్చానని, ఆ ప్రకారమే వాయుసేన ప్రతికూల వాతావరణంలో పాక్‌పై దాడి చేసిందని ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో ప్రధాని చెప్పారు.

game 27032019

అయితే వాస్తవానికి రాడార్ల పనితీరును మేఘాలు ప్రభావితం చేయలేవు. మేఘావృత వాతావరణంలో కూడా రాడార్లు పనిచేస్తాయి. దీంతో ప్రధాని అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెటిజన్లయితే వ్యంగ్య వ్యాఖ్యానాలతో మోదీని ఓ ఆటాడుకున్నారు. టీవీ చానెల్‌ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. ‘‘దాడి చేద్దామనుకున్న రోజు రాత్రి వాతావరణం ప్రతికూలంగా మారడంతో మరో రోజుకు వాయిదా వేద్దామని నిపుణులు సూచించారు. కానీ, దట్టమైన మబ్బులు, వర్షాలు వారి (పాక్‌) రాడార్ల దృష్టి నుంచి మనం తప్పించుకునేందుకు ఉపయోగపడొచ్చని చెప్పా. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో.. దీనివల్ల లాభపడతామేమో అనిపిస్తోంది, ముందుకే వెళ్లండని చెప్పా’’ అని ప్రధాని అన్నారు.

game 27032019

జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడుల గురించి మోదీ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్పును బీజేపీ ట్విటర్‌లో పెట్టింది. కానీ ప్రధాని వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో వెంటనే ఆ క్లిప్‌ను తొలగించింది. ట్వీట్‌ను తొలగించడంపైనా జమ్ముకశ్మీరు మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా వ్యంగ్యంగా స్పందించారు. ‘చూస్తుంటే ఆ ట్వీట్‌ మేఘాల్లోకి వెళ్లిపోయినట్లుంది. అదృష్టవశాత్తూ ఆ ట్వీట్‌ స్ర్కీన్‌షాట్లు సోషల్‌ మీడియాలో చాలా తిరుగుతున్నాయి’ అని ట్వీట్‌ చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై నెటిజన్లు భారీగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇక.. దాడులు జరిగిన రోజు యుద్ధవిమానాలు నడిపిన పైలట్లలో తాను(మోదీ) కూడా ఉన్నానని చెప్పడమే తరువాయి’ అని ఓ నెటిజన్‌ ఎద్దేవా చేశారు. ‘చల్లగా ఉంటుంది కాబట్టి రాత్రి వేళ సూర్యుడిపైకి అంతరిక్ష నౌకను పంపమన్నట్లుంది మోదీ వ్యవహారం’ అంటూ మరో వ్యక్తి ట్విటర్‌లో చమత్కరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read