ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో గతంలో నామినేట్ పదవుల్లో నియమితులైనవారిలో కొందరు ఇప్పటికే స్వచ్చందంగా తప్పుకున్నారు. మరికొందరు ప్రభుత్వం తమను తొలగిస్తే గానీ తప్పుకోమని అంటున్నారు. దీంతో, దేవాలయాల్లో పాలక మండళ్లు కూడా రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిపై పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, నటుడు మోహన్ బాబు కూడా ఈ రేసులో ఉన్నట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో వైసీపీ నేత మోహ‌న్‌బాబును తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం అధ్య‌క్ష ప‌ద‌వి వ‌రించ‌నుంద‌నే వార్త‌ గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌పై మోహన్ బాబు ట్విట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

mohanababu 05062019

తాను ప‌ద‌వులు ఆశించి రాజ‌కీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. `నేను టీటీడీ చైర్మ‌న్ రేసులో ఉన్న‌ట్టుగా కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు ఫోన్లు కూడా చేసి అడుగుతున్నారు. నా ఆశ‌యం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిగా చూడ‌డ‌మే. అందుకోసమే నా వంతుగా క‌ష్ట‌పడ్డాను. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముఖ్య‌మంత్రి అవుతాడ‌న్న న‌మ్మ‌కంతోనే నేను తిరిగి రాజ‌కీయాల్లోకి ప్రవేశించాను. అంతేగాని ఎలాంటి ప‌ద‌వులూ ఆశించి కాదు. ఇలాంటి పుకార్ల‌ను ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని మీడియాను కోరుతున్నాన‌`ని మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read