వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లం నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన మంగళవారం నిమిమించిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన సీఎంవోకి అధిపతిగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులుగా వ్యవహరించే అధికారుల మధ్య పని విభజన, వారు ఏయే శాఖల బాధ్యతలు నిర్వహించాలో ఆయనే నిర్దేశిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులంతా అజేయ్ కల్లమ్‌కి జవాబుదారీగా ఉంటారు. ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఏ సమాచారమైనా పొందడానికి, అవసరమైన సలహాలివ్వడానికి ఆయనకు అధికారం ఉంటుంది. ఈ పదవిలో మాజీ సీఎస్ మూడేళ్ల పాటు కొనసాగుతారు.

ajay 05062019 1

ఆయన సేవలకు గాను వేతనం కింద ప్రభుత్వం నెలకు రూ.2.50 లక్షల చెల్లించనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన పదవీ విరమణ చేసిన సమయానికి టీఏ, డీఏలు ప్రభుత్వం చెల్లించేదో ఇప్పుడు అంతే మొత్తం చెల్లిస్తారు. వాహన సదుపాయం, వసతి కల్పిస్తారు. ఆయన పేషీలో తాత్కాలికంగా తొమ్మిది పోస్టులను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అజేయ కల్లం టీటీడీ ఈవోగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ ఛైర్మన్‌గా, ఆర్థిక, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.

ajay 05062019 1

ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేసారు. రిటైర్డ్ అయిన తరువాత చంద్రబాబుని తిడుతూ, జగన్ కు దగ్గర అయ్యారు. రాజధాని అమరావతిలో స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని తప్పుబడుతూ తన అభిప్రాయాన్ని తెలిపారు. స్విస్‌ ఛాలెంజ్‌ లోపభూయిష్టంగా ఉందని, వైసిపీతో కలిసి అప్పట్లో గొడవలు చేసారు. రాజధాని భూములపై కూడా ఆయన ఓ పుస్తకం రాశారు. రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందని ఆయన తన పుస్తకంలో ఆరోపించారు. ఇలా ప్రతి రోజు చంద్రబాబుకి వ్యతిరేకంగా పోరాటం చేసి, ఇప్పుడు జగన్ పక్కన చేరి, ఏకంగా రూ.2.50 లక్షల జీతం పొందబోతున్నారు. జగన్ రూపాయి జీతం వార్తా విని సంతోషించే లోపే, ఇలాంటి వార్తలు కూడా వినాల్సి వస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read