జనసేనకు దక్కేవి నాలుగైదు సీట్లు మాత్రమే అంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో పవన్ అభిమానుల్లో అలజడి రేపింది. భీమవరంలో అంతా సవ్యంగా సాగితే పవన్‌దే గెలుపు అనుకుంటున్నా అనుమాన పొరలు కమ్ముకున్నాయి. ఫలితాలు పార్టీకి ఉత్తేజకరంగా ఉంటాయా..? నీరసపడేలా చేస్తాయా..? అంటూ జనసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు ఎన్నో వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలని ఆకస్మిక నిర్ణయంపై అందరిలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్వగ్రామం మొగల్తూరు వున్న నరసాపురం, పొరుగునే వున్న పాలకొల్లు నియోజక వర్గాలను కాకుండా భీమవరంలో ఎందుకు పోటీ చేయాలనుకున్నారు ? అంటూ అనేక ప్రశ్నలు వ్యక్త మయ్యాయి. ఒక పార్టీ అధినేతగా పవన్ మిగతా స్థానాల్లో పర్యటించి, ప్రచారం చేసి చివరగా భీమ వరంలోను సుడిగాలి ప్రచారం చేశారు.
ఆఖరుకు ఇక్కడ ఒక సామాజిక వర్గం వారు ఇష్టపడే అల్లూరి సీతారామరాజు వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానంటూ భరోసా ఇచ్చి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సొంత సామాజికవర్గం యా వత్తు తన వెంటే నిలుస్తుందని భావించారు. తగ్గట్టు గానే ఆయా సామాజిక వర్గాల పెద్దలతో మనసు పంచుకున్నారు. పార్టీ లక్ష్యాలను ఏకరవు పెట్టారు. తాను రెండుచోట్ల పోటీ చేస్తున్నా.. భీమవరానికి ప్రత్యేకత ఉందని, ఈ గడ్డ తన సొంత గడ్డ అంటూ స్ఫూర్తిని నింపారు. స్వచ్ఛందంగా అభిమానులు ప్రచారం చేశారు. ఏజెంట్లుగా వ్యవహరించి పోలింగ్ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత గెలుపుపై ధీమా ప్రదర్శించారు. ఎగ్జిట్‌పోల్స్ అనంతరం పార్టీ మీదవున్న ప్రజాభిమానం తాము ఆశించినట్టుగా ఓటు రూ పంలో మారలేదా ? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2009 పీఆర్పీ పోటీకి దిగినప్పుడు ఇంతకంటే రాజకీయాలు ఇంకో కోణంలో వెళ్లాయని, అప్పుడూ ముక్కోణపు పోటీ మాదిరిగానే ఈసారి ఉన్న.. పరిస్థితులు తమకు ఎందుకు అనుకూలంగా మారలేదనే స్వరాన్ని వినిపిస్తున్నారు. భీమవరంలో పవన్‌కల్యాణ్ గట్టెక్కుతారా ? లేదా ? అనే దానిపై ఇప్పుడు మరోమారు హాట్ టాపిక్ అయ్యింది. పాలకొల్లులో చిరంజీవికి ఎదురైన అనుభవమే రిపీట్ కాబోతుందా ? అనేది మరికొందరి అనుమానం. ఇప్పటికీ గెలుపు మీద కాస్తంత ధీమాతోవున్న అభి మానులు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను తేలిగ్గా తీసు కుంటున్నారు.