ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి తెదేపా తరఫున శుభాకాంక్షలు తెలిపేందుకు రెండు రోజులపాటు ప్రయత్నించినా అవకాశం లభించలేదని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న గంటా.. ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతూ.. ‘జగన్‌ వద్దకు వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలపడానికి నాతో పాటు మా పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడును పార్టీ అధిష్ఠానం నియమించింది. జగన్‌ను కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు. ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్‌ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవు. ప్రతిపక్షంతో పాటు మీడియానూ బెదిరిస్తున్నట్లుగా మాట్లాడారు. ఎన్నికల వేళ నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల నుంచి అప్పుడే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెండర్ల రద్దు విషయంలో గత ప్రభుత్వంపై కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

tdp 01062019

దిల్లీలో మోదీని కలిశాక ప్రత్యేక హోదాపై స్పష్టంగా మాట్లాడలేక జగన్‌ డొంకతిరుగుడుగా వ్యవహరించారు. వృద్ధుల పింఛన్లు రూ.3వేలకు పెంచుతామని చెప్పి.. కేవలం రూ.250 పెంచి రూ.2,250కి పరిమితం చేశారు. మద్యపాన నిషేధం విషయంలోనూ మాట దాటవేస్తూ దశలవారీగా అమలుచేసి ఆఖరుగా హోటళ్లలో విక్రయిస్తామని అంటున్నార’ని వ్యాఖ్యానించారు. తెదేపా శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకాభిప్రాయంతోనే ఎన్నుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ‘తెదేపాకు గెలుపోటములు కొత్తకాదు. గతంలోనూ ప్రతిపక్ష పాత్ర పోషించింది. త్వరలో పార్టీలో అంతర్గతంగా విశ్లేషించుకొని, పొరపాట్లను గుర్తించి, తిరిగి ప్రజల మద్దతు పొందేందుకు చర్యలు తీసుకుంటామ’ని గంటా వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read