ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హోరా హోరీ తలపడి, ఎన్నికల ఫలితాలు తరువాత జగన్ మొహన్ రెడ్డి, మాజీ ముఖ్యామంత్రి చంద్రబాబు ఒకే వేదిక పై కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు, ఇరు రాష్ట్రాలకు చెందిన నాయకులు రానున్నారు.జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గుంటారనే సమాచారం వచ్చింది. ఇదే కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం ఆహ్వానించారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం రాజ్‌భవన్ నుండి ఆహ్వానం వెళ్లింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆయన కూడా ఈ సారి ఇఫ్తార్ విందుకు హాజరవుతారని చెబుతున్నారు.
ఇక, రాజ్‌భవన్‌లో ఏ కార్యక్రమం జరిగిన తప్పని సరిగా హాజరయ్యే జనసేన అధినేత పవన్ కళ్యాన్‌కు ఇప్పటికే ఆహ్వానం పంపారు. ఆయన సైతం రాజభవ్న కార్యక్రమానికి వస్తారని తెలుస్తోంది. దీంతో..ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత ఈ ముగ్గురూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటున్నారనే సమాచారంతో రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల ప్రచారంలో హోరా హోరీ తలపడిన టీడీపీ-వైసీపీ-జనసేన అధినేతలు ఇప్పుడు ఎన్నికల పలితాల తరువాత ఒకే చోటకు వస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ ఆహ్వానించటం తో అందునా ఇఫ్తార్ విందు కావటంతో చంద్రబాబు వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నయని చెబుతున్నారు. ఇక, వీరంతా ఒకే చోటకు వస్తుండటంతో ఎలా వ్యవహరిస్తారు..ఎటువంటి సన్నివేశాలు కనిపిస్తాయనే ఆసక్తి నెలకొని ఉంది. మరి చంద్రబాబు వెళ్తారో లేదో, మరి కొద్ది సేపట్లో తెలిసిపోతుంది.