ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప ఎన్నికల కార్యదక్షుడు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురశీధర్‌రావు అన్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. బీజేపీతో సమానంగా బూత్ స్థాయి నుంచి పటిష్టమైన కార్యకర్తల వ్యవస్థ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మీడియాతో మురళీధర్‌రావు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో గత నెల రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ 280 నుంచి 310 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా తమ మిత్రపక్షాలకు 45 నుంచి 50 స్థానాలు లభిస్తాయని, నరేంద్ర మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 72 స్థానాలు గెలుచుకున్న తాము.. ఈసారి 35 నుంచి 40 స్థానాల్లో మాత్రమే గెలుస్తామని నెల రోజుల క్రితం భావించామని, కానీ ఇప్పుడు 70కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీస్తోందని, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలకు 150కి మించి స్థానాలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి 2014 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు వస్తాయన్నారు. ఇక తెలంగాణలో తాము 6 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్‌తోపాటు మరో రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా మోదీ పట్ల అంతగా వ్యతిరేకత లేదని పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప ఎన్నికల కార్యదక్షుడు అని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అయితే మొన్నటి వరకు చంద్రబాబు పై కారాలు, మిరియాలు నూరిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురశీధర్‌రావు, చంద్రాబాబు గెలుస్తారంటూ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం లేకపోలేదు. ఒకవేళ రేపు బీజేపీకి మెజారిటీ రాకపోతే, ప్రధాని అభ్యర్ధిగా గడ్కరీని ముందుకు తెచ్చే అవకాసం ఉంది. ఇలా అయినా, మోడీ పై కోపంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు, బీజేపీకి చేరువయ్యి, గడ్కరీని ప్రధానిగా బలపరుస్తారాని, బీజేపీ ప్లాన్ - బి రెడీగా ఉంచుకుంది. ఈ గేమ్ లో భాగంగానే, ఇప్పటి నుంచే చంద్రబాబు పై మెతక వైఖరితో వెళ్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. లేకపోతే, దీని వెనుక ఇంకా ఎలాంటి రాజకీయ ఆట ముడి పడి ఉందో, తొందరలోనే తెలుస్తుంది. మొత్తానికి చంద్రబాబు దెబ్బ, బీజేపీకి గట్టిగానే తగిలిందని చెప్పాలి.