ఏపీలో రాజకీయాల గురించి ప్రస్తావన వస్తే తప్పక చర్చకొచ్చే జిల్లా కృష్ణా. తొలి నుంచి రాజకీయాలకు పెట్టని కోటగా ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీ మళ్లీ హవా కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 10 స్థానాలను దక్కించుకుని సత్తా చాటింది. అప్పటికి టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పొత్తులో భాగంగా కైకలూరు స్థానం గెలుచుకుంది. వైసీపీ 5 స్థానాల్లో మాత్రమే గెలిచింది. వైసీపీ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్ టీడీపీలో చేరడంతో ఈ జిల్లాలో వైసీపీ బలం మూడుకు పడిపోయింది. ఈ పరిణామాలతో డీలా పడ్డ వైసీపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపింది.

kirshnadist 09052019

ఇక గుడివాడ నియోజకవర్గంలో అయితే వైసీపీ తరపున ఓటుకు 5వేలు పంచారనే ప్రచారం కూడా జరిగింది. గత ఎన్నికల్లో అంతంత మాత్రంగా గెలవడంతో ఈసారి టీడీపీతో సమంగానైనా గెలిచి పరువు నిలుపుకోవాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని వైసీపీ ఎత్తులు వేసింది. ఆర్థికంగా బలంగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్‌ను బరిలోకి దింపింది. ఇలా కృష్ణా జిల్లాలో వీలైనంత వరకూ ధన ప్రభావంతో గెలుపును సొంతం చేసుకోవాలని వైసీపీ చివరి నిమిషం వరకూ ప్రయత్నించింది. అయితే టీడీపీ మాత్రం జిల్లాలో మెజార్టీ స్థానాలు తమవేనని ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ మాజీ నేతలు ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, వంగవీటి రాధా చేరికలతో బలం పెరిగిందని టీడీపీ భావిస్తోంది. జిల్లాలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నియోజకవర్గం గుడివాడ. వైసీపీ అభ్యర్థి కొడాలి నానిని ఓడించి తీరాలని టీడీపీ వ్యూహ రచన చేసింది.

 

kirshnadist 09052019

అందుకు దేవినేని నెహ్రు కుమారుడు, యువనాయకుడైన దేవినేని అవినాష్ అయితేనే కరెక్ట్ అని ఆ పార్టీ భావించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రావి వెంకటరావుకు నచ్చజెప్పి దేవినేని అవినాష్‌తో కలిసి పనిచేసేలా చేయడంలో టీడీపీ సఫలమైంది. అవినాష్ ఎంట్రీతో కొడాలి నానికి ఈసారి కష్టమేనని, గుడివాడలో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడటం ఖాయమని టీడీపీ భావిస్తున్న స్థానాల్లో గన్నవరం, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, మైలవరం, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, జగ్గయ్యపేట, నందిగామ స్థానాలు ముందు వరుసలో ఉన్నాయి. తిరువూరు, నూజివీడు, గుడివాడ, పామర్రు, విజయవాడ వెస్ట్ స్థానాల్లో హోరాహోరీ పోరు తప్పదని టీడీపీ, వైసీపీ భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్ స్థానాల్లో వైసీపీ 5వేల లోపు మెజార్టీతోనే నెగ్గడంతో ఈ మూడు స్థానాలు కూడా టీడీపీ ఖాతాలోనే పడతాయని ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా మే 23న వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలు ఈసారి కృష్ణా జిల్లా రాజకీయాలకు ఎలాంటి మార్పులకు కారణం కానున్నాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read