ఏపీలో ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏమైంది? రెండు నెలలు గడిచినా వివేక కేసులో ఎందుకు పురోగతి కనిపించలేదు? ఎన్నికల ముందు హడావుడి చేసిన వైసీపీ నేతలు, వివేకా కుమార్తె ఇప్పుడేమయ్యారు? దర్యాప్తు అధికారులు ఏమంటున్నారు? వివేకను హతమార్చిందెరో తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డి, ముణి వెంకట కృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాష్‌కు తెలుసు. హత్య చేసిన వారిని చట్టం నుంచి తప్పించేందుకు ఈ ముగ్గురు ఉద్దేపూర్వకంగానే ఘటనా స్థలం నుంచి సాక్ష్యాలను తుడిచేశారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. హత్య జరిగి రెండు నెలలు గడుస్తున్నా అసలు వివేకాను హతమర్చిందెవరు? చేయించిదెవరో మాత్రం ఇప్పటికీ తేల్చలేకపోయారు.

viveka 08052019

‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డిని హతమార్చిందెవరో తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి, ములి వెంకటకృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్‌లకు తెలుసు. హత్య చేసిన వారిని చట్టం నుంచి తప్పించేందుకు వీరు ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే ఘటనాస్థలం నుంచి సాక్ష్యాధారాలను తుడిచేశారు’ అని రిమాండు రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ముగ్గురు నిందితులను 4 రోజులు కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ దోషుల వివరాలను రాబట్టడంలో సిట్ పూర్తిగా విఫలమైంది. హంతకులెవరో ఆ ముగ్గురు నిందితులకు తెలుసునని భావిస్తున్న అధికారులు వారినే లోతుగా విచారించడమో లేదా సత్యసాధన పరీక్షలకు అనుమతి తీసుకుని నిర్వహించడమో లేదా ఇతర మార్గాల ద్వారనైనా ప్రశ్నించి సమాచారం తెలుసుకోవచ్చు.

viveka 08052019

సిట్ అధికారులు మాత్రం ఇందులో విఫలమయ్యారు. ఈ బృందానికి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తుండగా అదనపు డీజీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. కడప జిల్లా పోలీసుల నేతృత్వంలో ఏడు, సిట్‌ ఆధ్వర్యంలో 5 బృందాలు పనిచేస్తున్నాయి. అయినా ఇప్పటికీ హంతకులెవరో తేల్చలేకపోయాయి. అయితే పోలీసులు ఇలా ఎందుకు చేస్తున్నారో అంతు పట్టటం లేదు. ఎన్నికల వంకతో, విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసారని, కడప జిల్లా ఎస్పీని మార్చారు. కేసు కీలక దశలో ఉండగా, ఎస్పీని మార్చటంతోనే అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు దానికి తగ్గట్టే పోలీసులు ముందుకు తీసుకువెళ్లటం లేదు. రేపు చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే, అప్పుడు ఈ కేసు మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాసం ఉంది. అయితే, అప్పటికి ఎంత వరకు సాక్షాలు దొరుకుతాయి అనేది అనుమానమే. ఇన్ని విషయాల పై గొడవ చేసే జగన్, అలాగే ఎన్నికల ముందు హడావిడి చేసిన వివేక కూతురు, అన్నిటికీ ఉత్తరాలు రాసే విజయసాయి రెడ్డి, ఎందుకు మౌనంగా ఉన్నారో, ఆ దేవుడికి, పైన ఉన్న వైఎస్ వివేకాకే తెలియాలి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read