శ్రీలంకలో ఉగ్రవాదులు చేసిన మారణహోమం ప్రపంచం మొత్తం చూసింది. చర్చిలు, హోటళ్లే టార్గెట్‌గా 13 చోట్ల ఆత్మాహుతి, బాంబు పేలుళ్లకు పాల్పడి వందల మంది ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాదులు దాడులు చెయ్యాలనుకుంటున్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచీ హెచ్చరికలు అందాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల్ని తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయన్న ఆయన... అధికారులంతా అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ప్రశ్నించాలని కొత్త ఆదేశాలు జారీచేశారు.

dgp thakur 08052019

ఆంధ్రప్రదేశ్‌కి తీర ప్రాంతం ఎక్కువ. ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ఏపీలోకి వచ్చేందుకు అవకాశాలు ఉండటంతో... తీర ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు. అలాగే వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏపీలోని హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్లో నిఘాను ఒక్కసారిగా పెంచారు. ప్రస్తుతం అధికారులంతా 24 గంటలూ అప్రమత్తంగా ఉండేందుకు సిద్ధమయ్యారు. పై అధికారుల నుంచీ వాళ్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. అసలే ఎన్నికల కౌంటింగ్‌కి సంబంధించి స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లూ ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాద దాడుల కలకలం రేగడంతో భద్రతను మరింత పెంచుతున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానితులు కనిపిస్తే, డయల్ 100కి కాల్ చెయ్యాలని సూచించారు.

dgp thakur 08052019

రాష్ట్ర పోలీస్‌ బాస్‌ ఆర్‌.పి.ఠాకూర్‌ రాష్ట్రంలోని ఎస్పీలు, సీపీలతో ఈరోజు మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి అత్యవసర వీడియో సమావేశం నిర్వహించారు. వామపక్షం, ఇస్లామిక్‌ తీవ్రవాదం హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా తీరప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని, హోటళ్లపై నిఘా పెంపు చేయాలని ఆదేశించారు. పొరుగు దేశం శ్రీంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా భద్రతాపరమైన లోపాలుంటే సరిదిద్దాలని ఆదేశించారు. సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచుతామని, అవసరమైన అన్ని చోట్ల కెమెరాలు ఏర్పాటయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఈనెల 23వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపైనా అధికారులతో సమీక్షించారు. స్ట్రాంగ్‌రూం భద్రత, కౌంటింగ్‌ బందోబస్తు అంశాలపై చర్చించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read