ఈ నెల 30న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఆ రోజు జ‌గ‌న్ ఒక్క‌రే ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. పూర్తి కేబినెట్ ఏర్పాటు మ‌రో వారం ప‌డుతుంద‌ని జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే, మంత్రుల‌కు సంబంధించి ర‌క‌ర‌కాలుగా పేర్లు..వారి శాఖ‌లు ప్ర‌చారంలో ఉన్నా..ఔత్సాహికుల్లో మాత్రం టెన్ష‌న్ పెరిగిపోతోంది. దీంతో.. జ‌గ‌న్‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌టానికి కొంద‌రు కేసీఆర్ ద్వారా ప్ర‌య‌త్నాలు చేస్తుంటే..మ‌రి కొంద‌రు జ‌గ‌న్ ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా న‌మ్ముతున్న ఇద్ద‌రు ప్ర‌ముఖులతో సిఫార్సు ప్ర‌య‌త్నాలు చేయిస్తున్నారు. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా గెల‌వ‌టం ద్వారా కేబినెట్ లో స్థానం కోసం ఆశావాహులు ఎక్కువ‌గానే ఉన్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో ఎవ‌రుండాల‌నే విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసారు.

jagan minister 27052019

అయినా..జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా ఒక మాట చెప్ప‌గలిగిన వారితో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద్వారా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఈ సారి పోటీ ఎక్కువ‌గా ఉంది. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు పేరు సైతం ప్రచారంలో ఉంది. వెలమ సామాజికవర్గానికి చెందిన ప్రతాప్‌ అప్పారావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ద్వారా జగన్‌కు సిఫారసు చేయిస్తున్నట్లు సమాచారం. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం.. మచ్చలేని రాజకీయ నేపథ్యం ప్రతాప్‌ అప్పారావుకు కలిసివచ్చే అంశాలని..మీరు చెబితే ఖ‌చ్చితంగా జ‌గ‌న్ ఒప్పుకుంటార‌ని అభ్య‌ర్దిస్తున్నారు.

jagan minister 27052019

కొంత కాలంగా జ‌గ‌న్ ఇద్ద‌రి సూచ‌న‌లు..స‌ల‌హాల‌కు ప్రాధాన్య‌తఇస్తున్నారు. పాద‌యాత్ర ముహూర్తం మొద‌లు.. అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న‌..సంఖ్య‌..ప్రాంతం..ప్ర‌మాణ స్వీకారం వంటి ప్ర‌తీ విష‌యంలోనూ ఆ ఇద్ద‌రి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలోనే ప‌ని చేస్తున్నారు. అందులో ఒక‌రు విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి కాగా..మ‌రొక‌రు చిన జీయ‌ర్ స్వామి. ఉత్త‌రాంధ్రకు చెందిన అనేక మంది నేత‌లు ఎప్ప‌టి నుండో విశాఖ శార‌దా పీఠంలో భ‌క్తులుగా ఉన్నారు. స్వ‌రూపానంద స్వామితో వ్య‌క్తిగ‌తంగా స‌న్నిహిత సంబంధాలు ఉన్న నేత‌లు జ‌గ‌న్ మూడ్‌కు అనుగుణంగా అక్క‌డి నుండి సిఫార్సు చేయించుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చిన‌జీయ‌ర్ స్వామి అటువంటి సిఫార్సులు చేయ‌ర‌ని ఆయ‌న భ‌క్తులు స్ప‌ష్టం చేస్తున్నారు. దీంతో..ఎమ్మెల్యేలు నేరుగా ఈ ఇద్ద‌రితో సంబంధాలు ఉన్న‌వారి వారి ద్వారా మ‌రి కొంత మంది వారి ప్ర‌ధాన శిష్య‌గ‌ణం ద్వారా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read