తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన రద్దయింది. దిల్లీలో విమానం ల్యాండింగ్‌కు అనుమతిలేని కారణంగా వీరిద్దరి పర్యటన రద్దయినట్లు సమాచారం. షెడ్యూల్లో లేని విమానాల ల్యాండింగ్‌కు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అనుమతులు రద్దు చేసింది. దీంతో ఇద్దరు సీఎంలు తమ హస్తిన పర్యటనను రద్దు చేసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం... విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం తర్వాత ఆయనతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో దిల్లీకి బయల్దేరాల్సి ఉంది.
రాష్ట్రపతి భవన్లో ఈ రోజు రాత్రి 7గంటలకు జరిగే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ప్రత్యేక విమానానికి అనుమతి లేకపోవడంతో వీరి హస్తిన పర్యటన రద్దయింది. అయితే ఇద్దరు ముఖ్యమంత్రుల షడ్యుల్ ప్రోగ్రాం ఉంటే, ఇలా రద్దు చెయ్యటం ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకు ఇలా జరిగిందా అని, ఇరు పార్టీల నేతలు ఢిల్లీలో ఆరా తీసుకున్నారు. కేసీఆర్, జగన్ కలిసి ఢిల్లీ వెళ్తారని, మూడు రోజుల నుంచి వార్తలు వచ్చాయి. అంటే ఇది షడ్యుల్ ప్రోగ్రాం కిందే లెక్క వస్తుంది. మరి ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రులకు పర్మిషన్ లేదు అని చెప్పటం ఏంటో ఎవరికీ అంతు పట్టటం లేదు. మోడీ మార్క్ ట్రీట్మెంట్ మొదలైందా అనే చర్చ నడుస్తుంది.