ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముందు ఒక ఆసక్తి కర పరిణామం చోటు చేసుకోనుంది. టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ వద్దకు రానున్నారు. టీడీపీ శాసనసభా పక్షం..పార్టీ అధినేత కొత్తగా ఏపీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్న జగన్‌కు అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను అందించనున్నారు. వారు మధ్నాహ్నం జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. జగన్ వద్దకు వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని.. ఆ కార్యక్రమానికి హాజరు కావాలని జగన్ నేరుగా చంద్రబాబు కు ఫోన్ చేసారు. దీంతో..జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలా వద్దా అనే అంశం మీద టీడీఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది.
చంద్రబాబు తాను జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లానుకుంటున్నానని చెప్పగా..మిగిలిన నేతలు గతంలో ఎప్పుడూ ప్రత్యర్ధి పార్టీల నేతలు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే వెళ్లిన సందర్బాలు లేవని చెబుతూ..వారించారు. దీంతో.. వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారానికి హాజరుకాకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావును పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందే అభినందనలు తెలిపేందుకు.. జగన్ నివాసానికి టీడీపీ బృందం వెళ్లనుంది.