చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ జరగనున్న 5పోలింగ్‌ కేంద్రాల్లో రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం కూడా ఒకటి. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణమ స్వగ్రామం.. టీడీపీకి పెట్టనికోట. శుక్రవారం అక్కడకు ప్రచారానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఊరిలోకి రావద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో తాను గాజులు తొడుక్కుని లేనని.. తిరుపతిలో అడుగుపెడితే మీ కథ చూస్తానంటూ ఆయన వారిని బెదిరించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్‌ఆర్‌ కమ్మపల్లెలో ప్రచారానికి వెళ్లిన చెవిరెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డిని గ్రామస్థులు అడ్డుకోవడంతో చెవిరెడ్డి పెద్దఎత్తున అనుచరవర్గంతో అక్కడకు చేరుకున్నారు. 

chevireddy 17052019

టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా గ్రామస్థులకు మద్దతుగా రావడంతో ఇరువర్గాలూ ఎదురెదురుగా మోహరించాయి. డీఐజీ క్రాంతిరాణా టాటా, చిత్తూరు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ బలగాలతో చేరుకుని లాఠీచార్జి జరిపి ఇరువర్గాలనూ చెదరగొట్టారు. శుక్రవారం ఉదయం వెంకట్రామాపురానికి చెవిరెడ్డి వాహనాల కాన్వాయ్‌తో మందీ మార్బలాన్ని వెంటబెట్టుకుని మళ్లీ వచ్చారు. గ్రామస్థులు అడ్డుకున్నారు. తప్పుడు ఫిర్యాదులు చేసి రీపోలింగ్‌ పెట్టించారని మండిపడ్డారు. చెవిరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంటలో రీపోలింగ్‌ ఎందుకు పెట్టించుకోలేదని నిలదీశారు. గ్రామంలోకి రావద్దంటూ మహిళలు సహా అంతా ఆయన ముఖంమీదే చెప్పడంతో చెవిరెడ్డి రెచ్చిపోయారు.

chevireddy 17052019

‘మీరు అ డ్డుకుంటే నేనేం గాజు లు తొడుక్కుని లేను... రండి ఎవరు అడ్డుకుంటారో.. నన్ను ఇక్కడ అడ్డుకుంటే తిరుపతిలో అడుగుపెట్టలేరు’ అని హె చ్చరించారు. బలగాల రక్షణలో ఆయన గ్రామంలోకి వెళ్లారు. అయితే గ్రామస్థులు ‘దొంగ వస్తున్నాడు.. తలుపులేసుకోండి’ అని గట్టిగా అరుస్తూ ప్రతి ఇంట్లోని వారినీ అప్రమత్తం చేయడంతో చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తిరుపతిలో అడుగుపెట్టండి మీ కథ చెప్తా.. ఎలా తిరిగి వెళతారో చూస్తా’ అంటూ హెచ్చరించారు. బలగాలు సైతం ఆయనకే రక్షణ కల్పిస్తూ గ్రామస్థులను నెట్టేశాయి. ‘మేం స్వచ్ఛందంగా ఓట్లు వేశాం. మమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టింది లేదు. 1983లో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినాకనే మాకు రాజకీయమంటే ఏంటో తెలిసింది. పెద్దాయన ముద్దుకృష్ణమది మా ఊరే. ఈసారి ఇంకా కసిగా ఓట్లు వేస్తాం.’ అని అక్కడి గ్రామస్థులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read