ఈనెల 23వ తేదీన ప్రజా తీర్పు బయటకు వచ్చిన తర్వాతే బీజేపీయేతర కూటమికి ఎవరు ప్రధాని అనే దానిపై కీలక నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో చివరిది, ఏడవది అయిన ఎన్నికల ప్రచారం ముగియడానికి కొద్దిసేపు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాహుల్...ఈ ఎన్నికలో కాంగ్రెస్ న్యాయపోరాటం సాగించిందని, న్యాయమే చివరకు గెలుస్తుందని అన్నారు. ప్రధాని ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణకు ఈ ఎన్నికల్లో తాము సమర్ధవంతంగా పోరాడమని, బీజేపీ-ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై పోరాటంలో 'ఏ గ్రేడ్' స్థాయిలో పోరాడమని చెప్పారు.
నరేంద్ర మోదీని నిలువరిస్తూ, తమకు మద్దతుగా నిలిచిన లక్షలాది ప్రజలను చూసి ఒక భారతీయుడిగా తాను గర్విస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ఆశిస్తున్న సీట్లు, ఇతర విపక్ష పార్టీలతో పొత్తుపై అడిగినప్పుడు తీర్పు రాకముందే ప్రజా నిర్ణయంపై మాట్లాడటం వారిని అగౌరవపరిచినట్టేనని సమాధానమిచ్చారు. 23న ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వంలో ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. ప్రజాతీర్పు రాకముందే తాను మాట్లాడటం బాగుందని, ప్రజలేమి నిర్ణయించుకున్నారనే దానిపై ఆధారపడి తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇతర విపక్ష పార్టీల నుంచి ప్రధాని పదవిని ఆశిస్తున్న వారున్నారనే విషయంపై స్పందిస్తూ, 'మాయావతి లేదా ఇతర నాయకుల గురించి నేను కామెంట్ చేయదలచుకోవాలి. సైద్ధాంతిక పరంగా చూసినప్పటికీ అన్నీ విస్తృత ప్రాతిపదికపై కలుస్తాయి. చంద్రబాబునాయుడు బీజేపీకి మద్దతిస్తారని నేను అనుకోవడం లేదు. అలాగే మమతా, మాయావతి, ములాయం సింగ్‌లు కూడా బీజేపీ వైపు వెళ్తారనుకోవటం లేదు' అని రాహుల్ నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల్లో ఈసీ పారదర్శకంగా వ్యవహరిస్తోందని, మోదీ షెడ్యూల్ ప్రకారమే ఉత్తర్వులు ఇస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. మోదీ, షా సిద్ధాంతాలు గాంధీ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి మోదీ మరోసారి ప్రయత్నిస్తున్నారని, అయితే అది జరగదని ఎద్దేవాచేశారు.