సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటి వచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు మిత్ర పక్షాలను వెతుక్కునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సోనియా గాంధీ కూటమిలోకి చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఈ నెల 23న ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల నేతలను ఢిల్లీకి పిలిచారంటూ వస్తోన్న వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తమ అధినేత్రి ఏ నేతకూ లేఖ రాయలేదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు.

game 27032019

వైసీపీ, టీఆర్ఎస్ నేతలకు సోనియా లేఖలు రాశారంటూ వస్తున్నవన్నీ ఊహాగానాలే అని ఆయన కొట్టిపారేశారు. ఈ నెల 23న జరిగే కీలక సమావేశం తర్వాతే ఎవరెవరితో కలవాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నెల 23న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల అనంతరం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో ఎన్డీయేయేతర పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేలా కాంగ్రెస్ తన ప్రయత్నాలను ప్రారంభించిందన్న సంకేతాన్ని ఇచ్చేందుకే సోనియాగాంధీ 23న ఈ సమావేశం పెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు. ఫలితాల అనంతరం భావ సారూప్యతగల పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసేందుకు పార్టీ సీనియర్ నేతలు పీ చిదంబరం, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌తో కాంగ్రెస్ పార్టీ ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read