రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఈసారి పెట్టినంత వ్యయం గతంలో ఎన్నడూ పెట్టలేదని సీనియర్‌ నాయకులే చెబుతున్నారు. ఇలా ఖర్చు చేయాలంటే తమ వల్ల కాదని కొందరు చేతులెత్తేశారు. ఏం చేస్తే తిరిగి అన్ని కోట్ల రూపాయలు వెనక్కి వస్తాయని మరికొందరు లబోదిబోమన్నారు. అయితే ఎన్నికల కమిషన్‌కు మాత్రం పెద్దగా ఖర్చు కాలేదు అంటూ లెక్కలు చూపించారు. ఎన్నికల సంఘం అభ్యర్థుల వ్యయానికి సంబంధించిన ఒక పరిమితి విధించింది. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులైతే రూ.28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులైతే రూ.70 లక్షల వరకు ఖర్చు చేయవచ్చునని పేర్కొంది. అంతకు మించి ఖర్చు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించింది. బ్యాంకు ఖాతా తెరిచి, అందులో సొమ్ము డిపాజిట్‌ చేసి, దేనికైనా అందులో నుంచే చెల్లింపులు జరపాలని సూచించింది.

pk 16052019

ఏ రోజు ఖర్చు ఆ రోజే చూపించాలని ఆదేశించింది. అభ్యర్థులు సమర్పించే లెక్కలు సరైనవా? కావా? వారు ఎక్కువ ఖర్చు చేసి, తక్కువ చూపిస్తున్నారా? అనే విషయం తెలుసుకోవడానికి నిఘా బృందాలను ఏర్పాటుచేసింది. ఇలా 18 బృందాలు రంగంలో దిగి అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేస్తున్నారో ఏ రోజుకారోజు లెక్కలు రాసుకున్నాయి. ప్రచారం ముగిసిన తరువాత అభ్యర్థులు కూడా తమ లెక్కలు సమర్పించారు. వాటిని చూసి అధికారులు బిత్తరపోయారు. కొందరు నిర్దేశించిన వ్యయంలో సగం కూడా ఖర్చు చేయలేదని లెక్కలు సమర్పించారు. విశాఖపట్నం జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి అధమంగా రూ.10 కోట్ల నుంచి అత్యధికంగా రూ.40 కోట్ల వరకు వెచ్చించారు. ఇందులో ఓటర్లకు పంచిన డబ్బు సంగతి పక్కన పెట్టినా క్షేత్రస్థాయిలో చేసిన ఖర్చు రూ.5 కోట్లకు తక్కువ లేదు. అయితే అభ్యర్థులు అందులో పదో వంతు కూడా లెక్క చూపించలేదు.

pk 16052019

అలాగే పార్లమెంటుకు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.40 కోట్లు చొప్పున ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. వారు కూడా రూ.50 లక్షలకు మించి వ్యయం కాలేదని నివేదికలు సమర్పించారు. వాటన్నింటినీ పరిశీలిస్తున్న బృందం తేదీల వారీగా ఎక్కడ ఎంత ఖర్చు చేసిందీ విశ్లేషించి, ప్రత్యేకంగా మరో నివేదిక రూపొందిస్తోంది. ఆ మేరకు లెక్కల్లో తేడాలున్నాయని, వాటికి సమాధానాలు ఇవ్వాలని నోటీసులు జారీచేస్తోంది. వీటిపై కౌంటింగ్‌ ముగిసిన తరువాత విచారణ జరుగుతుందని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో, రూ.8,39,790/- ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించారు. మంత్రి గంటా ఖర్చు రూ.23,19,325, కేకే రాజు రూ.2,43,711, ముత్తంశెట్టి శ్రీనివాసరావు రూ.12,88,392 ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read