ఈ నెల 23న ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో..రాష్ట్రపతి నిర్ణయమే ఫైనల్ కానుంది. దేశాధ్యక్షుని ముందు అందుబాటులో ఉండే కొన్ని అవకాశా ల్ని రాజ్యాంగ నిపుణులు ఈ విధంగా విశ్లేషిస్తున్నారు… ఎన్నికైన సభ్యుందరితో తాత్కాలిక స్పీకర్‌ అధ్యక్షతన ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించడం. ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీ నాయకున్ని ఆహ్వానించడం. అందుకు విముఖత ఎదురైతే ఎన్నికలకు ముందు ఏర్పడ్డ కూటమి నాయకుడికి అవకాశం కల్పించడం. అదీ సానుకూలం కాని పక్షంలో సర్కారియా కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి నాయకుడిని ఆహ్వానించడం. ఈ విషయంలో దేశాధ్యక్షుడికే సర్వాధికా రాలుంటాయి. తన విచక్షణాధికారం మేరకే ఆయన ఎవర్నైనా ఆహ్వానించొచ్చని రాజ్యాంగం చెబుతోంది.

game 27032019

ఎవరూ ముందుకు రాని పక్షంలో ప్రస్తుత ప్రధానినే కొంతకాలం ఆపద్దర్మ ప్రధానిగా వ్యవహరించమని కోరడం. ఇలాంటి సందర్భంలో పేరుకు పార్లమెంట్‌ ఉన్న ప్పటికీ అది సుషుప్త చేతనావస్థలో ఉంటుంది. పరోక్షంగా దేశాధ్యక్షుని పాలనే సాగుతుంది. ప్రతి నిర్ణయాన్ని దేశాధ్యక్షుడు ఆమోదించాల్సుంటుంది. ఇప్పటికే ఏప్రిల్‌ నుంచి మూడు మాసాలకు అమలయ్యే విధంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జూలై 1నుంచి ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర బిల్లుల చెల్లింపున కు ప్రభుత్వానికి అధికారముండదు. దీంతో ఈలోగా ఆపద్దర్మ ప్రధాని నాయకత్వంలోనే మరో మూడుమా సాలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టి దేశాధ్యక్షుని అనుమతి తో దాన్ని అమల్లోకి తీసుకురావాల్సుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆరుమాసాలకు మించి పార్ల మెంట్‌ సుషుప్త చేతనావస్తలో ఉంచడాన్ని రాజ్యాంగం ఆమోదించదు. ఈలోగా ఒక పార్టీ లేదా పార్టీల కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురావాలి. లేనిపక్షంలో లోక్‌సభను రద్దు చేసే అధికారం దేశాధ్యక్షునికి దఖలౌతుం ది. రద్దు చేసి కొత్తగా ఎన్నికలు జరపమని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించొచ్చు. లేదా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకురాని పక్షంలో దేశంలో అధ్యక్ష పాలన విధించే అధి కారం కూడా దేశాధ్యక్షునికుంది. ఎన్నికైన సభ్యుల్తో సంబంధంలేకుం డా తిరిగి ఎన్నికల నిర్వహణకు ఆదేశాలిచ్చే అధికారమూ ఆయన సొంతం.

game 27032019

దేశంలో 9వ లోక్‌సభ నుంచి హంగ్‌ ప్రభుత్వాల ఏర్పాటు మొదలైంది. అయితే అవన్నీ పలు ఆటుపోట్లకు గురయ్యా యి. అంతకుముందు ఏదొక పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించేది. 1989ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 197సీట్లొస్తే జనతాదళ్‌ 143, బిజెపి 85సీట్లలో గెలిచాయి. బిజెపి మద్దతుతో విపి సింగ్‌ నాయకత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అయితే అదే పార్టీ 1990లో చీలిపోయింది. చంద్రశేఖర్‌ సమాజ్‌వాదీ జనతా పార్టీ తరపున మరో పార్టీ పెట్టుకున్నారు. విపి సింగ్‌కు ఆయన వర్గం మద్దతు ఉపసంహరించింది. కాంగ్రెస్‌ మద్ద తుతో చంద్రశేఖర్‌ ప్రధాని అయ్యారు. అయితే ఆయన ఏడుమాసాలు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. 10వ లోక్‌సభలో కాంగ్రెస్‌ 232సీట్లు పొంది ఏకైక పెద్దపార్టీగా అవతరించింది. పివి నరసింహరావు మైనార్టీ ప్రభుత్వా నికి నాయకుడయ్యారు. వివిధ ప్రాంతీయ పార్టీల్ని చీల్చి ఐదేళ్ళు తన మెజార్టీని కొనసాగించగలిగారు. తిరిగి 1996లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బిజెపి 161సీట్లు పొందితే కాంగ్రెస్‌కు 140, జనతాదళ్‌కు 46సీట్లు వచ్చా యి. బిజెపి తరపున వాజ్‌పేయి మైనార్టీ ప్రభుత్వాన్ని నెల కొల్పారు. కానీ అది సాగలేదు. జనతాదళ్‌ నాయకత్వంలో ఏర్పడ్డ యునైటెడ్‌ ఫ్రంట్‌ దేవగౌడ ప్రధానిగా మరో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇది కూడా 18మాసాలే అధికారంలో ఉంది. ఆ తర్వాత ఐకె గుజ్రాల్‌ ఈ బాధ్యతలోకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read