లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, భాజపాయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. కాంగ్రెస్‌, భాజపాయేతర ప్రాంతీయ పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మరుసటి రోజే స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్‌ నిన్న చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, ఇందు కోసం తాను చేస్తున్న ప్రయత్నానికి మద్దతు పలకాలని కేసీఆర్‌ కోరారు. అయితే తెలంగాణ సీఎంతో భేటీ జరిగిన మరుసటి రోజే.. ఫెడరల్ ఫ్రంట్ పై స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

stalin 14052019

భాజపా, కాంగ్రెస్‌ లేకుండా మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని తనకు అన్పించడం లేదని అన్నారు. అయితే మే 23 తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందన్నారు. అంతేగాక.. ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కోరేందుకు కేసీఆర్‌ చెన్నై రాలేదని, కేవలం దైవ దర్శనాల కోసం వచ్చారని బాంబు పేల్చారు. ‘కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆయన(కేసీఆర్‌) ఇక్కడకు రాలేదు. ఆలయాల దర్శన కోసం తమిళనాడు వచ్చారు. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకే నా అపాయింట్‌మెంట్‌ కోరారు. అంతే’ అని స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే హైదరాబాద్ మీడియా గత రెండు రోజులుగా కేసీఆర్ పై చేస్తున్న హడావిడి చూసాం. ఇదంతా ఒక్క మాటలో తీసి పడేసారు స్టాలిన్. కేవలం దైవ దర్శనాల కోసం వచ్చారని చెప్పారు.

stalin 14052019

‘‘ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి. సింహభాగం వాటాను దక్కించుకోవాలి. కేవలం కేబినెట్‌ పదవులే కాదు.. మరింత ఉన్నత పదవిని సాధించాలి. విధాన నిర్ణయాల్లోనూ మన మాట చెల్లుబాటు కావాలి. గవర్నర్ల నియామకంలోనూ మన పాత్ర ఉండాలి’’ అని వివరించారు. తద్వారా, తన ఉప ప్రధాని ఆకాంక్షపై కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. అయితే, రాహుల్‌ ప్రధాని కావాలని ఇప్పటికే రెండుసార్లు బహిరంగంగా ప్రకటించిన స్టాలిన్‌ కేసీఆర్‌ వాదనకు లొంగలేదు. సరికదా.. ‘మీరే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు మద్దతు తెలపండి’ అని కోరారు. స్టాలిన్‌తో భేటీ తర్వాత తెలంగాణ ఎంపీలతో కలిసి కేసీఆర్‌ కారెక్కి వెళ్లిపోయారు. డీఎంకే మాజీ ఎంపీ టీఆర్‌ బాలు, కోశాధికారి దురై మురుగన్‌ సైతం సమావేశ వివరాలను విలేకరుల ఎదుట వెల్లడించకుండా మౌనం పాటించారు. అనంతరం, కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే స్టాలిన్‌ కలుసుకున్నారని డీఎంకే అధిష్ఠానం క్లుప్తంగా ఓ ప్రకటన జారీ చేసింది. కానీ, ఈ రోజు అసలు విషయం చెప్పి, కేసీఆర్ గాలి తీసారు స్టాలిన్...

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read