బాలాకోట్‌ దాడుల వ్యూహరచనలో తన పాత్ర గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఊహించని తిప్పలు తెచ్చిపెట్టాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నెటిజన్లయితే వ్యంగ్య వ్యాఖ్యానాలతో మోదీని ఓ ఆటాడుకున్నారు. ఈ కాంట్రవర్సీ నడుస్తుండగానే ఇప్పుడు మరో విషయమై నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజెన్లు. టీవీ చానెల్‌ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. తాను 1988లోనే తాను డిజిటల్ కెమెరాను ఉపయోగించానని బీజేపీ సీనియర్ నేత ఎల్.కే. అద్వాణీ ఫొటో తీశానని మోదీ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా అదే సమయంలో ఇంటర్నెట్ ద్వారా ఈమెయిల్ కూడా పంపినట్లు మోదీ తెలిపారు.

modiphoto 13052019

అయితే డిజిటల్ కెమెరాను 1990లో మొదటిసారి వినియోగంలోకి రాగా, ఈమెయిల్ 1995లో అందుబాటులోకి వచ్చింది. ‘అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కూడా 1988లో ఈమెయిల్ అంటే ఎవరికీ తెలియదు. నేను కూడా 1996లోనే మొదటి ఈమెయిల్ చేశాను. అలాంటిది మోదీ 1988లోనే ఈమెయిల్ చశారు’ అంటూ ప్రముఖ ఆర్థికవేత్త రూప సుబ్రహ్మణ్య ట్వీట్ చేశారు. ‘ఇక మోదీ ఈ మెయిల్ ఉపయోగించిన సమయంలో అద్వాణీ కూడా ఈమెయిల్ ఉపయోగించారా?’ అంటూ మరొకరు ఆశ్చర్యం వెలిబుచ్చారు. ‘డ్రైనేజి నుంచి గ్యాస్ తయారు చేసినట్లుగానే మోదీ డిజిటల్ కెమెరాను, ఈమెయిల్‌ను తయారు చేశారు. రాడార్లు చొచ్చుకుపోని మేఘాలను కూడా మోదీ కనుగొన్నారు. భక్తులకు ఇంకేమైనా అనుమానం ఉందా?’ -షాహిద్ సిద్ధీకీ

modiphoto 13052019

‘మోదీ 1988లోనే ఈమెయిల్ ఉపయోగించారు. చిత్రమేంటంటే ప్రపంచంలో ఎవరూ దాన్ని అప్పటి వరకు ఎరుగరు’ -దివ్య స్పందన.. ‘1987-88లోనే డిజిటల్ కెమెరాతో కలర్ ఫొటో తీశానని, 1988లోనే ఈమెయిల్ ఉపయోగించానని మోదీ అంటున్నారు. బహుశా.. ఆయనకు మెడికల్ ట్రీట్‌మెంట్ అవసరం’ -అశోక్ స్వాయిన్... ఇలా చేసిన మొదటి ప్రధాని మోదీనే.. 1. ఈమెయిల్ విడుదలయ్యే 7 ఏళ్లకు ముందే ఉపయోగించడం 2. డిజిటల్ కెమెరా విడుదలయ్యే 8 ఏళ్లకు ముందే ఉపయోగించడం 3. రాడార్లకు చిక్కకుండా మబ్బుల చాటున విమనాల్ని దాచడం 4. మామిడి పండు తిన్నాక దాచుకోవడం -క్టౌడీ నెహ్ర్ వూ

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read