అమరావతి కేంద్రంగా జరుగుతున్న టీడీపీ ఎన్నికల సమీక్షల్లో ఏం జరుగుతోంది? ఆ పార్టీలో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరాటం తర్వాత ఫలితాలపై కింది స్థాయిలో టీడీపీ నేతల అంచనాలు ఎలా ఉన్నాయి.. వారేం చెబుతున్నారన్నదాని పై అటు ఆ పార్టీ అధిష్ఠానం మొదలుకొని బయటి వారి వరకూ తెలుసుకొ నే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమీక్షలకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు ఏభై మంది నేతలను పిలుస్తున్నారు. ఇందులో మండలస్ధాయి నేతలు మొదలుకొని ఏరియా సమన్వయకర్తల వరకూ ఉన్నారు. ఈ సమీక్షలకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాష్ట్ర స్థాయి నేతను పరిశీలకునిగా నియమిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షతో సంబంధం లేకుండా ఈ పరిశీలకుడు ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి నాయకుడితో విడివిడిగా మాట్లాడి పోలింగ్‌ జరిగిన తీరు, ఫలితం పై అంచనాను అడిగి తెలుసుకొంటున్నారు.

cbn 14052019

పార్టీ రాష్ట్ర కార్యాలయం నేతలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్షేత్ర స్థాయి నేతలు చెప్పిన విషయాలతో పోల్చి చూసుకొంటున్నారు. ఇంచుమించుగా ఇవన్నీ ఒకే విధంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమీక్షలకు హాజరైన పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు బలమైన టానిక్‌ తాగించారు. ఈ ఎన్నికల్లో ఖాయంగా గెలుస్తున్నామని ఆయన వ్యక్తం చేసిన ధీమా టీడీపీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ సమీక్షల కు ఆ జిల్లా నుంచి ఒక మహిళా నేత హాజరయ్యారు. అంతకు ముందు ఆమె పార్టీ విజయావకాశాలపై అంత నమ్మకంతో లేరు. కానీ, ఈ సమీక్ష తర్వాత పార్టీ కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆమెకు గట్టి నమ్మకం కలిగింది.

cbn 14052019

దీనితో ఆమె ఈ సమీక్ష ముగిసిన తర్వాత ఇం టికి వెళ్లకుండా రాజధాని ప్రాంతంలో స్థలం కొనుక్కొంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆరాలు తీయడం ప్రారంభించారు. మళ్లీ టీడీపీ వస్తే రాజధానిలో భూముల ధరలు పెరుగుతాయన్నది ఆమె అంచనా. చంద్రబాబు వ్యక్తం చేస్తున్న ధీమా ప్రత్యర్థి శిబిరంలో కూడా కలవరం పెంచింది. వైసీపీలో టాప్‌ ఐదు స్థానాల్లో ఉన్న ఒక నేత మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి చంద్రబాబులో కనిపిస్తున్న ధీమాకు కారణం ఏమిటని తెలుసుకొనే ప్రయత్నం ప్రారంభించారు. ‘పోలింగ్‌ అయిన మొదట్లో ఆయనలో అంత ధీమా కనిపించలేదు. ఈ మధ్య బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యలో ఏం జరిగింది’ అని ఆయన ఆరా తీస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read