ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీఎంకే నేత దొరై మురుగన్ సమావేశమయ్యారు. సుమారు 25 నిముషాలపాటు ఇరువురు చర్చలు జరిపారు. నిన్న సాయంత్రం స్టాలిన్, కేసీఆర్ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు దొరై మురుగన్ వివరించినట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరారు. అయితే తాము కాంగ్రెస్ వైపే ఉంటామని, అవసరమైతే మీరు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ కేసీఆర్‌కు స్టాలిన్ సూచించారని వార్తలొచ్చాయి. కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్టాలిన్ మంగళవారం ఉదయం చెన్నైలో ఒక ప్రకటన చేశారు. దేశంలో మూడో ఫ్రంట్‌కు అవకాశమే లేదని స్పష్టం చేశారు.

dmk 14052019

మరోవైపు గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి జాతీయ స్థాయిలో టీడీపీ, డీఎంకే పోరాడుతున్నాయి. పలు అంశాల్లో డీఎంకేకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్‌తో భేటీ ముగిసిన తెల్లారే దొరై మురుగున్‌ను అమరావతికి స్టాలిన్ పంపారు. కేసీఆర్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు వివరించాలంటూ మురుగన్‌కు చెప్పి పంపారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై తీసుకోవాల్సిన అంశాలపై కూడా చంద్రబాబుతో మాట్లాడాలని డీఎంకే నేతలు నిర్ణయించారు. నిజానికి మూడో కూటమిపై స్టాలిన్‌కు మొదటి నుంచి ఆసక్తి లేదు. ఇందుకు కారణం.. గతంలో థర్డ్ ఫ్రంట్ ప్రయోగం రెండు సార్లు విఫలం కావడమేనన్నది ఆయన అభిప్రాయం.

dmk 14052019

అందుకే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్న చంద్రబాబుతో సంబంధాలు కొనసాగించాలని స్టాలిన్ కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే దొరై మురుగన్‌కు అమరావతికి పంపారు. కేసీఆర్‌ ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా యూపీఏతోనే ఉంటానని స్టాలిన్‌ స్పష్టం చేశారని, ఆయననే కాంగ్రెస్‌ కూటమిలోకి ఆహ్వానించారని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. స్టాలిన్‌ను ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి ఆహ్వానించాలన్న కేసీఆర్‌కు నిరాశే మిగిలిందని, ఆయన ప్రతిపాదనను స్టాలిన్‌ తిరస్కరించారని ఎన్డీటీవీ తెలిపింది. తన ‘ఉప ప్రధాని ఆకాంక్ష’పై కేసీఆర్‌ స్టాలిన్‌కు చాలా సంకేతాలు ఇచ్చారని వివరించింది. స్టాలిన్‌ తిరస్కరణతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లుగా ఉందని పీటీఐ వ్యాఖ్యానించింది. జాతీయ పార్టీల సహకారంతో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఇందుకు వామపక్షాలు కూడా మద్దతు పలుకుతాయని కేసీఆర్‌ ప్రతిపాదించారని, అయితే, యూపీఏకే పరిస్థితి సానుకూలంగా ఉందని డీఎంకే నేతలు తెలిపారని వివరించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read