గత వారం రోజులుగా, కేసిఆర్, జగన్, గవర్నర్ కలిసి వేస్తున్న చెట్టాపట్టాల్ ఇరు రాష్ట్రల ప్రజలు చుస్తునే ఉన్నారు. వీరి మధ్య స్నేహం ఎంత దాకా వెళ్ళింది అంటే, కనీసం క్యాబినెట్ మీటింగ్ పెట్టకుండా, ప్రజలకు ఏమి వివరించకుండా, ఏకపక్షంగా ఆంధ్రపదేశ్ భవనాలు, తెలంగాణాకు అప్పగించే దాకా వెళ్ళింది. ఒక గంట విందులో పాల్గుని, రాత్రికి రాత్రి, ఏపి ఆస్తులు తెలంగాణాకు ఇచ్చేసారు. దీంతో ఇప్పుడు కేసిఆర్ కు, జగన్ మధ్య స్నేహం తారా స్థాయిలో ఉంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి ముఖ్యమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఎవరిని నియమించాలనే దాని పై దృష్టిసారించిన జగన్ దాని పై కసరత్తు చేస్తున్నారు. రేసులో చలనచిత్ర నటుడు ప్రముఖ విద్యావేత్త మోహన్ బాబు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కోన రఘుపతి తదితరులు టిటిడి బోర్డు చైర్మన్ పదవిని ఆశిస్తుండగా జగన్ తన బాబాయి వై వి సుబ్బారెడ్డి పేరును ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అంతేకాదు రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ నుంచి ఒక టిఆర్ఎస్ నాయకుడికి టిటిడి బోర్డు నెంబర్ గా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కేసిఆర్ సిఫార్సు మేరకు, ఈ నియామకం జరుగుతున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించి, ఆపై టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ సీఎం వైఎస్ జగన్ బంపరాఫర్ ఇచ్చారు. పార్టీ మారినప్పటికీ, జగన్ పై అభిమానాన్ని చూపిస్తూ వచ్చిన పొంగులేటికి టీటీడీ బోర్డ్ సభ్యుడి పదవిని జగన్ ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. కేసిఆర్ సిఫార్సు మేరకు, పొంగులేటిని నామినేట్ చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాంతం నుండి టిటిడి బోర్డు సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య ను నియమించింది అయితే 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సండ్ర వెంకటవీరయ్య టిటిడి బోర్డు మెంబర్ గా ప్రమాణస్వీకారం చెయ్యలేదు. దీంతో అతన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఆ తర్వాత ఖమ్మం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు లేదా కోనేరు చిన్నికి టిటిడి బోర్డు మెంబర్ గా అవకాశం ఇవ్వాలని భావించారు. కానీ అనూహ్యంగా టిడిపి ఓటమిపాలైంది. తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టు వింటూ, కేసిఆర్ మాట జవదాటని జగన్మోహన్ రెడ్డి ఖమ్మం నుండి టిటిడి బోర్డు సభ్యుడిగా గతంలో తమ పార్టీలో పనిచేసిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి అవకాశం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. ఇటీవల కేసీఆర్ తో జరిగిన జగన్ భేటీ సమయంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ తో పాటుగా ఉన్నారు.