బెజవాడ శివార్లలోనే గొల్లపుడిలో నిన్న (శనివారం) అర్ధరాత్రి అల్లరి మూకలు బీభత్సం సృష్టించారు. తాము వెళ్తున్న బైక్‌కు సైడ్ ఇవ్వలేదని తెలంగాణాకు చెందినా ఆర్టీసీ బస్సును యువకులు ఆపి మరీ, బస్సు డ్రైవర్‌‌ను చితకబాదారు. అక్కడితో వారి ఆగడాలు ఆగలేదు. బస్సు లోపాలకి చొరబడి డ్రైవర్ పై డాడి చేసి, 25 వేలు ఎత్తుకెళ్ళారు. ఆ అల్లరి మూకల బీభత్సంతో భయబ్రాంతులకు గురైన బస్సు ప్రయాణికులు, అడ్డగించేందుకు కూడా భయపడి ఏమి చెయ్యలేకపోయారు. మొత్తంగా 50 మంది యువకులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు ముందుభాగంలోని అద్దాలను సైతం ధ్వంసం చేశారు.

bus 02062019 1

డ్రైవర్‌పై తీవ్రంగా దాడి చేసి టిమ్‌ మిషన్‌, రూ.25వేల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ బస్సు నార్కట్‌పల్లి డిపోకి చెందినదిగా గుర్తించారు. ఈ ఘటన హైదరాబాద్ హైవేపై భవానిపురం వద్ద చోటుచేసుకుంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో పలువురు యువకులు ఉన్నారని.. మరికొందరి కోసం గాలిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read