రీవెరిఫికేషన్ ఫలితాల్లోనూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తనదైన శైలిలో అయోమయం సృష్టిస్తోంది. ఇంటర్‌లో ఫెయిలై ఆత్మహత్య చేసుకున్న అనామిక అనే విద్యార్థిని మార్కుల విషయంలో గందరగోళానికి తెరలేపింది. తెలుగులో ఫెయిలైనందుకు బాధతో ఆత్మహత్యకు పాల్పడిన అనామిక.. రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణురాలైందని వెబ్సైట్‌లో వెల్లడించిన ఇంటర్ బోర్డు.. కొద్దిసేపటికే మాటమార్చి ఆమె ఫెయిలైందని పేర్కొంది. అనామికకు రీవెరిఫికేషన్‌లో 48 మార్కులు వచ్చినట్లు తప్పుగా పేర్కొన్నామని వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఆమెకు తెలుగులో గతంలో 20 మార్కులు రాగా.. రీవెరిఫికేషన్‌లో ఒక్క మార్కు పెరిగి మొత్తం 21 మాత్రమే వచ్చాయని వెల్లడించింది. మూల్యాంకన కేంద్రంలో క్లరికల్ సిబ్బంది పొరపాటు వల్ల ఈ గందరగోళం తలెత్తిందని స్పష్టంచేసింది.

anamika 02062019

అనామిక మార్కుల వ్యవహారంలో తప్పు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు కమిటీ నియమించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. అనామిక జవాబు పత్రాన్ని ఆయన మీడియాకు విడుదల చేశారు. ఫెయిలైన విద్యార్థులందరివీ సమాధాన పత్రాలనూ రీవెరిఫికేషన్‌ చేశామని.. వారెవరూ ఉత్తీర్ణులు కాలేదని గతంలో బోర్డు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు అనామిక కుటుంబ సభ్యులు తాజాగా ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించగా.. ఆమెకు 28 మార్కులు పెరిగి మొత్తం 48 మార్కులతో పాసైనట్టుగా వెబ్‌సైట్‌లో కన్పించడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. సీపీఐ నేతలతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో ఇంటర్‌ బోర్డు మరోసారి వివరణ ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read