చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, ఎంతో ముందు చూపుతో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించారు. కాని, ఆ ఫలాలు అందుకునే టైంలో, ఆయన ఓడిపోయారు. తరువాత రాజశేఖర్ రెడ్డి గద్దెనెక్కారు. చంద్రబాబు పెంచిన ఫలాలు అన్నీ రాష్ట్రాభివృద్ధి కాక, తన సొంత ప్రయోజనాలకి వాడుకున్నారు. ఇక కొడుకు చేసిన దోపిడీ అయితే అంతే లేదు. ఇలాంటి దోపిడీల్లో ఒకటి ఎర్రచందనం. అప్పట్లో చంద్రబాబు ముందు చూపుతో అలోచించి, ఎర్రచందనానికి విదేశీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది అని, అందుకే నల్లమల్ల ఆడవులలో వీటిని పెంచి, రాష్ట్ర ఖజానాకు ఆదయవనరుగా మార్చాలని అనుకున్నారు. దానికి తగ్గ పరిశోధనలు జరిపి, నల్లమల్ల అడవుల్లో, ఎర్రచందనం పెంచేలా చేసారు. కాని తరువాత రాజశేఖర్ రెడ్డి తన మనుషుల చేత ఏమి చేసాడో అందరికీ తెలుసు.
ఈ ఎర్రచందనం దొంగలు, కొంత మందిని ఎమ్మల్యేలను కూడా చేసాడు రాజశేఖర్ రెడ్డి. అయితే, మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సీన్ మారిపోయింది. వరుస ఎన్కౌంటర్లతో, స్మగ్గలర్లని వెంటాడారు. దీంతో కొంత మేరకు స్మగ్గ్లింగ్ తగ్గింది. ఈ పట్టుబడిన ఎర్రచందనం ఇప్పుడు, రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే 10 విడతల అమ్మకం పూర్తయ్యింది. తాజాగా, 11వ విడత వేలం కూడా చేసారు. 11వ విడత వేలంలో 355 టన్నుల ఎర్రచందనం విక్రయించారు. దీంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు రూ.141 కోట్ల ఆదాయం వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో కొందరు స్మగ్లర్లు నల్లమల్ల అడవుల్లోకి చొరబడి దొంగచాటుగా ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులకు పట్టుబడిన ఎర్రచందనం దుంగలను తాజా వేలంలో విక్రయించారు. ఏపీ ప్రభుత్వం ఎర్రచందనం రవాణాను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ చెట్టు కలపతో చేసే వాయిద్యాలను జపాన్ వాసులు సంగీత సాధనంగా ఉపయోగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటిలో ఉండటం వాళ్లు ఆచారంగా భావిస్తారు. అందుకే ఈ కలపను చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ఈ కలపతో వారు బొమ్మలు, సంగీత పరికరాలు తయారు చేసుకుంటారు. అంతేకాకుండా వీరు ఎర్రచందనంతో చేసిన పరికరాలు ఇంట్లో ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారట.