హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌తో హరికృష్ణకు ఎంతో అనుబంధం ఉంది. దీంతో ఆయన పార్థివదేహాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి, నివాళులు అర్పించాలని టీడీపీ నేతలు భావించారు. అయితే, అంతకుముందే నార్కెట్‌పల్లి ఆస్పత్రి నుంచి భౌతిక కాయాన్ని హరికృష్ణ నివాసానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి నేరుగా మహా ప్రస్థానానికే వెళ్లాలని, మధ్యలో ఎక్కడైనా ఆపితే, మళ్లీ ఇంటికి తీసుకొచ్చి స్నానాదికాలు చేయాలని పండితులు స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి మళ్లీ వెనక్కు ఇంటికి తీసుకువెళ్లడం సరికాదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు.

hari 31082018 2

ఇక, అంతిమయాత్ర ప్రారంభం అయ్యే సమయంలో హరికృష్ణ కుటుంబ సభ్యులను చంద్రబాబు పిలిచి మాట్లాడారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్న హరికృష్ణ దేహంపై పార్టీ పతాకం కప్పుతామని, వారికి అభ్యంతరం లేకపోతే ఆ పని చేస్తామని చెప్పారు. వారు అంగీకరించడంతో ఆయన పార్టీ పతాకం కప్పారు. గురువారం రాత్రికి ఆయన విజయవాడకు తిరిగి వచ్చారు. మంత్రులు, పార్టీ సీనియర్లు, రెండు రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ రెండు రోజులూ అక్కడే ఉండిపోయారు. గతంలో పార్టీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు కూడా చంద్రబాబు పాదయాత్రను ఆపేసి... హుటాహుటిన శ్రీకాకుళం వెళ్లి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read