కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన విజయవాడ గేట్ వే హోటల్‌కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గేట్‌వే హోటల్‌లో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది.

kuamra 31082018 2

సీఎంతో పాటు మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిత్తూరు పర్యటనకు వెళ్తూ మధ్యలో ఆగి కుమారస్వామితో సీఎం సమావేశమయ్యారు. చంద్రబాబు-కుమారస్వామి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా తాము కలిసినట్లు చెప్పారు. ఎన్డీయేను ఓడించేందుకు కలిసొచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోతామని చంద్రబాబు స్పష్టంచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు మరోమారు భేటీ అవుతామని చెప్పారు.

kuamra 31082018 3

కుమారస్వామి మాట్లాడుతూ, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాత ఆలోచిస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏను ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. అలాగే.. మేమంతా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాం... దేశానికి మూడో ప్రత్యామ్నాయం అవసరం లేదని బీజేపీ అనడంలో ఆశ్చర్యం లేదు అని కుమారస్వామి అన్నారు. కుమారస్వామి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరివెళ్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read