పుట్టపర్తి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమాదేవి (56) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో హైదరాబాద్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం 3.46 గంటలకు తుది శ్వాస విడిచారు. బాలాజీ విద్యాసంస్థల తరపున తమ విద్యా సంస్థల తరపున అనేకమంది ఉపాధి చూపారు. ఉమాదేవి మృతితో పుట్టపర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె బౌతికాయన్ని హైదరాబాద్ నుంచి అనంతపురంలోని అలమూరు రోడ్డు లోని పీవీకేకే కళాశాల వద్ద ఉన్న పల్లె నివాసానికి తరలిస్తున్నారు. అంతకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు ఉమాదేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. పల్లెను ఓదార్చారు.
నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది పిల్లలకు ఉమా దేవి ఉచితంగా విద్య అందించారు. ఆమె చేసిన సేవ రఘునాథరెడ్డికి రాజకీయంగానూ ఉపయోగపడింది. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో రఘునాథరెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారం కూడా నిర్వహించారు. ఉమా దేవి మృతితో అనంతపురంలోని పుట్టపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లె రఘునాథరెడ్డిని పరామర్శించారు. సీఎంతో ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు.