గుంటూరులో ఈనెల 28న ముఖ్యమంత్రి పాల్గొన్న ‘నారా హమారా- తెదేపా హమారా’ సభలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ పార్టీ పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేసారు. గురువారం తన కార్యాలయంలో ఎస్పీ ఈ కుట్రకు సంబంధించిన వివరాలను విలేకరులకు వివరించారు. సభలో సీఎం ప్రసంగిస్తుండగా సాయంత్రం 5.54 గంటల సమయంలో కొంతమంది ప్లకార్డులు చేతపట్టి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని అన్నారు. పోలీసులు అప్రమత్తమై వారిని శాంతింపజేశారని తెలిపారు. దీనిపై 29న తెదేపా నాయకుడు షేక్‌ మీరావలీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. సభ జరుగుతుండగా సరిగ్గా 5.45 గంటలకు అక్కడున్న ఒకరి సెల్‌ఫోన్‌కు సభను భగ్నం చేయాలనే సంక్షిప్త సమాచారం వచ్చిందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా దీన్ని గుర్తించామన్నారు.

jagan 31082018 2

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వైకాపా రాష్ట్ర మైనారిటీ సెల్‌ కార్యదర్శి షేక్‌సయ్యద్‌ అబీబుల్లా ఈ కుట్రకు సూత్రధారని వెల్లడించారు. అదే ప్రాంతానికి చెందిన షేక్‌జుబేర్‌, షేక్‌ మహబూబ్‌బాషా, షేక్‌ జుబేర్‌అహ్మద్‌, సయ్యద్‌ అబీద్‌, షేక్‌అక్తర్‌ సల్మాన్‌ జక్రియ, షేక్‌ ఇలియాజ్‌, షేక్‌ ముక్తు, మహ్మద్‌ ముజావుద్దీన్‌లను ఉద్దేశపూర్వకంగా సభను భగ్నం చేయడానికి రైలులో గుంటూరుకు అబీబుల్లా పంపించాడని తేలిందన్నారు. అలజడితో ప్రజలు, అధికారులు, మీడియా దృష్టిని ఆకర్షించాలనేది వారి పథకమని తేలిందని వెల్లడించారు. తొమ్మిది మంది నిందితులపై రౌడీషీట్లు నమోదు చేస్తామని వివరించారు.

jagan 31082018 3

అయితే ఈ కుట్ర అంతా జగన్ కనుసనల్లోనే జరిగిందనే ప్రచారం జరుగుతుంది. తన తండ్రి లాగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్లాన్ వేసాడు జగన్. ఈ నిందితులు అంతా, శిల్పా మోహన్ రెడ్డి అనుచరులుగా గుర్తించారు. అయితే వీరి అందరి పై ఇప్పటికే, కర్నూల్, నంద్యాలలో వివిధ కేసులు ఉన్నాయి. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళని వాడుకుని, జగన్ పార్టీ, ఈ కుట్రకు తెర లేపింది. బహిరంగ సభ భగ్నం చెయ్యటానికి వైసిపి ప్లాన్ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ప్రధాని మోదీ, జగన్ మధ్య స్నేహం ఎక్కువైందన్నారు. రాయలసీమ యువకులతో గుంటూరు మైనార్టీ సభను భగ్నం చేయాలని జగన్ కుట్ర పన్నారని ఆయన ధ్వజమెత్తారు. మోదీకి మైనార్టీలు దూరమవుతున్నారని జగన్ బాధ పడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలే సభకు పంపారని పోలీసుల దర్యాప్తులో గుంటూరు మైనార్టీ సభలో అల్లరి చేసిన యువకులు ఒప్పుకున్నారని కేఈ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read