ఇది ఎన్నికల ఏడాది. మరో ఎనిమిది నెలల్లో చంద్రబాబు ఎన్నికలకు వెళ్తున్నారు. ఇదే సమయం అనుకున్నారో ఏమో, చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి, తమ డిమాండ్లు నెరవేర్చుకుంటానికి ప్రభుత్వ ఉద్యోగులు రెడీ అయ్యారు. ఒక పెద్ద కోరికల చిట్టా ఇచ్చి, ఇవి నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగులకు 63 శాతం ఫిట్మెంట్‌తో రూ. 25వేల కనీస వేతనం చెల్లించాలని, తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను తక్షణం క్రమబద్ధీకరించాలని, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్‌ఆర్ పాలసీని అమలు పరచాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

employees 12092018 2

రాష్ట్రంలోని 94 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సంఘాల కనీస అవసరాలను ప్రతిబింబిస్తూ బొప్పరాజు నాయకత్వంలో దాదాపు 62 సంఘాల ప్రతినిధులతో కలిసి మంగళవారం సచివాలయంలో 11వ పీఆర్‌సీ కమిషనర్ అశుతోష్ మిశ్రాను కల్సి ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ప్రస్తుతమున్న సామాజిక పరిస్థితులను, పెరుగుతున్న ధరలను, సాంకేతిక అంశాలను, జాతీయ ధరల ఇండెక్స్‌ను దృష్టిలో ఉంచుకుని నిష్ణాతులు సుదీర్ఘ అనుభవం కల్గిన నేతలతో చర్చించి తమ నివేదిక అందించామన్నారు.

employees 12092018 3

ఇప్పటికే రాష్ట్రం పై భారం అయినా, 43 శాతం ఫిట్మెంట్‌ ఇచ్చారు చంద్రబాబు. ఇది వరకు లాగా కాకుండా, ఒత్తిడి లేకుండా పని చేసేలా చేస్తున్నారు. సచివాలయంలో పని చేసే వాళ్ళకి అయితే, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లాగా 5 డేస్ వీక్. హైదరాబాద్ కి స్పెషల్ ట్రైన్. ఇలా అనేక విధాలుగా, ప్రభుత్వ ఉద్యోగులని ఆడుకుంటున్నా, వీరు ఇప్పుడు వచ్చి 63 శాతం ఫిట్మెంట్‌ అడుగుతున్నారు. రాష్ట్రం ఉన్న పరిస్థితి తెలిసినా, ఇది ఎంత భారమో తెలిసినా, వీళ్ళు కోరటం న్యాయమా ? పోనీ వీరి జీతాలు సామాన్య ప్రజలు జీతాలు లాగా, 10 వేలు, 20 వేల జీతాలా ? సామాన్యుడు ఒక పక్క అల్లాడి పోతుంటే, మళ్ళీ వచ్చి, ఉద్యోగులు 63 శాతం ఫిట్మెంట్‌ అడిగితే, పడే చిల్లు ప్రభుత్వానికి, అంటే ప్రజలకి. ఈ డిమాండ్ ను మన ఉద్యోగులు వెనక్కు తీసుకుంటారని ఆశిద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read