మంత్రి నారా లోకేష్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేక ఆహ్వానం పంపిచింది. చైనా లో సెప్టెంబర్ 18 నుండి 20 వరకూ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాలకు హాజరు కావాలి అని మంత్రి లోకేష్ కి ఆహ్వానం వచ్చింది. దేశంలో ఇద్దరు మంత్రులకు మాత్రమే ఆహ్వానం పంపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాల్లో మన దేశం తరపున మంత్రి నారా లోకేష్ కి మాత్రమే మాట్లాడే అవకాశం.
3 రోజుల పాటు 11 ముఖ్య సమావేశాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితుల గురించి వివరించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం బోర్డ్ మెంబెర్స్ తో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. సెప్టెంబర్ 17 నుండి 22 వ తారీఖు వరకూ మంత్రి నారా లోకేష్ చైనా లో పర్యటించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనడంతో పాటు, పలు ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులను కలవనున్నారు. పలు ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలతో ఒప్పందం..పలు కీలక ప్రకటనలు ఉండబోతున్నాయి.