దమ్ము ధైర్యం ఉంటే కెసిఆర్ లాగా, చంద్రబాబు కూడా అసెంబ్లీ రద్దు చెయ్యాలి అంటూ జగన్, ఒక తల తిక్క ప్రకటన చేసాడు. అలా ఎందుకు చేసాడు ? ఇదీ విశ్లేషణ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా పని చేస్తూ విభజన హామీలు అమలు చేయడం లేదు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఓపికగా బీజేపీతో వివాదాలు లేకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్రాభివృద్ధికి శతవిధాలా కృషి చేసింది.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే గిట్టని ప్రధాని మోడీ కుళ్ళు కుతంత్రాలతో వ్యవహరించడం ఆరంభించారు. ఆ మేరకు, ఆయా ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధుల కేటాయింపు, సహకరించడంలో నానాటికీ మొండి తనంతో నడుచుకుంటోంది. వెనకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులు వెనక్కి మళ్లించి దుర్మార్గంగా ప్రవర్తించింది. ఇన్నాళ్ళూ సంయమనంతో మసలుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీని దుయ్యబట్టడం మొదలుపెట్టారు.
బహిరంగంగా కేంద్రప్రభుత్వ అధినేత ప్రధాని మోడీ మూర్ఖత్వాన్ని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కాలక్షేపం చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం చివరకు మోసంతో వ్యవహరిస్తోంది. అతకని సమాధానాలతో తెలుగు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోంది. అయినా వైకాపా నాయకుడు జగన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధాని మోడీని ఒక్క మాట అనడం లేదు... రాష్ట్రానికి తీవ్రనష్టం తలపెడుతున్న మోడీని బహిరంగంగా విమర్శించిన దాఖలాలు లేవు. అదే కాకుండా తెలంగాణా లో రాష్ట్రప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ఏపీలో చేయాలని కోరడంలో అర్థం లేదు... తెలంగాణాలో వైకాపాకు పోటీ చేసే సత్తా లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో బలమైన కార్యకర్తల బలం ,ప్రజల మద్దతు ఉంది.. అయితే కేసీఆర్ దుందుడుకు పోకడలతో బెదిరింపులతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను, నాయకులను పార్టీ మారేలా ప్రవర్తించి లబ్ది పొందాడు.
అదీ కాకుండా కేసీఆర్ ప్రధాని మోడీతో లాలూచి వ్యవహారాలూ నడిపి తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు తెరదీశారు.. ఈ స్థితిలో తెలంగాణాలో కేసీఆర్ కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణాలో కేసీఆర్ ఓటమికన్నా బీజేపీ పావులుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ వంటి పార్టీలను దెబ్బతీయడం మిగిలిన పార్టీల మధ్య ఐక్యతకు దారితీస్తోంది. తెలంగాణాలో ఓటమి పరోక్షంగా బీజేపీ, ప్రధాని మోడీ ఆటలకు అడ్డుకట్ట పడటం ధ్యేయంగా పని చేస్తున్నాయి మిగిలినపార్టీలు .. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో బీజేపీ కుట్రలకు, కుతంత్రాలను ఎదుర్కోవటానికి తెలంగాణాలో మహాకూటమి దిశగా అడుగులు పడుతున్నాయి.
తెలంగాణాలో కేసీఆర్ ఓటమి పరోక్షంగా బీజేపీని రాజకీయ కుతంత్రాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలకు ఊతం లభించనుంది.. అదేస్థితిలో జగన్ బీజేపీ కి వ్యతిరేక శక్తులతో బహిరంగంగా కూటమి కట్టే ధైర్యం చూపగలడా? లోపాయికారీ ఒప్పందాలతో మొదటి నుంచీ జగన్ కేసీఆర్ తోనూ కుమ్మక్కు రాజకీయాలను నడుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. జగన్ తెలంగాణలో పోటీ చేసినా ఒంటరిగా పోటీ చేసి కేసీఆర్ వ్యతిరేక ఓట్ల చీలికకు ప్రయత్నం మాత్రం చేయవచ్చు ... కేసీఆర్, మోదీలకు ప్రయోజనం చేకూర్చే కుతంత్రాలతో భాగంగా జగన్ అడుగులు ఉంటాయనడంలో సందేహం లేదు... చివరగా జగన్ కి ఒక ఛాలెంజ్, శుక్రవారం కోర్ట్ కి వెళ్ళకుండా ఉండగలవా ?