ఆత్మగౌరవం నినాదంతో, ఢిల్లీ అహం పై తిరగబడి, ఎన్టీఆర్‌ స్దాపించిన తెలుగుదేశం పార్టీ, అనూహ్యంగా అధికారం లోకి వచ్చింది.. రాజకీయాల్లో కొత్త నీరు, కొత్త ఒరవడి, సంక్షేమం, క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత వచ్చాయి... ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా దేశంలో ఏర్పడిన జనతా పార్టీ ప్రయోగం విఫలమై, ఇందిరే ఇండియా...ఇండియా నే ఇందిర అనుకుంటున్న కాలం... గవర్నర్ లను అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలను కూలుస్తున్న కాలం... అదే విధంగా ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చారు... తెలుగువారికి రాజకీయ జుగుప్సాకర విన్యాసాలు తెలిసివచ్చాయి.. ప్రజాస్వామ్య పునరుద్దరణ ఉద్యమం ...దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పక్షాలన్నీ యన్టీఆర్‌ కి బాసట గా నిలిచాయి... సిద్దాంతాలు...భావజాలాలు..అన్నీ పక్కన పెట్టి రాజకీయ పక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చిన సందర్భం...

cbn 09092018

ఇందిర లాంటి ఐరన్ లేడీ...డైనమిక్ లీడర్...దేశానికి ఎమర్జెన్సీ అంటే ఏంటో చూపించిన ప్రధానమంత్రి ...ప్రజా ఉద్యమానికి తలవంచి...ప్రజాభిప్రాయాన్ని గౌరవించి...తిరిగి యన్టీఆర్‌ ని ముఖ్యమంత్రి స్దానంలో కూర్చోపెట్టారు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ...వరుసగా పార్లమెంటు ...అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ని మట్టికరిపించారు...ఇందిర మరణానంతరం వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో అయితే దేశమంతా కాంగ్రెస్ కి పట్టం కడితే ...ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కి ఘన విజయాన్నిచ్చారు...భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధానప్రతిపక్షం గా పని చేసే అవకాశం ఇచ్చారు... సహజంగా ఏపి లో కాంగ్రెస్ ...టీడీపీ లే ప్రధాన పక్షాలవటం తో ...ఆనాటి నుండి టీఆరెస్ ఆవిర్భావం వరకు పోటీ పడుతూ వచ్చాయి.. టీడీపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఇప్పటి వరకు అన్ని ఎన్నికలలో పోటీ చేసింది..అనంతరం దేశం మొత్తం మీద రెండు సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ తో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే...

cbn 09092018

జాతీయ పార్టీ లు ...కాంగ్రెస్ ...బీజేపీ లు ఆయా రాష్ట్రాల లో తమ ప్రత్యర్థి పార్టీ లతో ...పొత్తులు పోటీలు తడవ తడవ కు మార్చుకున్నాయి...అప్పటి అవసరాలు కి ప్రాధాన్య మిచ్చాయి...సిద్దాంతాలు ప్రాతిపదికన పనిచేసే కమ్యూనిస్టు లు కూడా ...వేర్వేరు రాష్ట్రాల లో వేర్వేరు పార్టీ లతో కలిది పనిచేసాయి...ఇన్నాళ్ళూ కాంగ్రెస్ దేశమంతా ప్రధానపక్షం గా ఉండేది... ఇప్పుడు ఆ స్దానం బీజేపీ ఆక్రమించింది... కాలం మారుతుంది...రాజకీయాల్లో కి కొత్త తరం వచ్చింది... సమాజం ...మారింది...సమాచార వ్యవస్దమెరుగైంది..సాంకేతిక విప్లవం వచ్చింది...మూడుదశాబ్దాల నాటి రాజకీయ వాతావరణం ఇప్పుడు లేదు...ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల లో యన్టీఆర్‌ టీడీపీ పుణ్యాన ...బడుగు బలహీన వర్గాలు ...విద్యావంతులు...రాజకీయ వేదిక మీదకు ప్రవేశించారు...అధికారం అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చింది...

cbn 09092018 2

బీజేపీ దేశమంతా వ్యాపించింది...రాజనీతిజ్ఞులు..వాజ్ పాయ్ ...అద్వానీ లు ...ఇంకా పలువురు ప్రాధాన్యత కోల్పోయారు... మోదీ షా లాంటి వారు వీర విహారం చేస్తున్నారు... దేశానికి ఎమర్జెన్సీ రుచి చూపించిన ఇందిర కంటే అప్రకటిత ఎమర్జెన్సీ ని అమలు చేస్తున్న తీరు ..ఏక పక్ష ధోరణి...అధికార కాంక్ష దేశ ప్రజలను నివ్వెర పోయేలా చేస్తున్నాయి...మాట విన్నా...వినక పోయినా...మిత్రపక్షమైనా ...శత్రుపక్షమైనా .....స్వపక్షంలో ని సీనియర్లైనా ...ఎవ్వరైనా ఒకటే మంత్రం... బీజేపీ ..మోదీ ...షా ల అరాచక పాలన...దుందుడుకు నిర్ణయాలు దేశ ప్రజలను హతాశులను చేస్తున్నాయి.. ఎమర్జెన్సీ విధించిన ఇందిర కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు...కాని దేశాన్ని కాషాయమయం చేయటానికి మోదీ బృందం ...అనుసరిస్తున్న విధానాలు...ఎటుదారి తీస్తాయీ అన్న గుబులు కలుగుతుంది...

cbn 09092018 3

దక్షిణాది రాష్ట్రాలపట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ...కాంగ్రెస్ బెటరనిపిస్తుంది... బీజేపీ అవనీతి పరులను నెత్తికెత్తుకున్న తీరు...కేసుల బూచి చూపించి పార్టీ లను వశపర్చుకుంటున్న విధానం ...ఆందోళన కలిగిస్తుంది.. ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ ...మోదీ ...షా లు వ్యవహరిస్తున్న తీరు వారి గుట్టు బయటపెట్టింది...అవమానం ...అవహేళన..బాధ్యతారాహిత్యం...అణచివేత ధోరణి ...కొత్త రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు తో విసిగి పోయిన టీడీపీ తప్పని పరిస్దితుల్లో ...పోరాటానికి మద్దతు వెతుక్కోవలసి వస్తుంది... ఆ క్రమం లో భావస్వారూప్యం తో పాటు..ఏక లక్ష్య సాధన లో కలసి వచ్చే పార్టీ లతో జట్టు కట్టాల్సివస్తుంది... తెలంగాణ లో మోదీ సామంతులను నిలువరించే అవకాశం వచ్చింది... ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకుని తీరాలి... భవిష్యత్తులో కూడా కలసి వచ్చి విభజన హామీలు నెరవేరుస్తారని నమ్మాలి...హామీలు అమలు కాక పోతే తిరిగి పోరాటమే శరణ్యం... ప్రస్తుతం ఉమ్మడి శత్రువుని కలిసి ఎదుర్కోవటమే సరైన సమయంలో సరైన నిర్ణయం... courtesy: శ్రీనివాస రావు గారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read